Egg: గుండెకు మేలు చేసే గుడ్డు.. రోజు తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే!
Egg: ప్రతీ రోజు గుడ్డు తినడం వల్ల అనేక లాభాలు ఉంటాయని, ముఖ్యంగా గుడ్డు తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 01:50 PM, Wed - 15 October 25

Egg: కోడిగుడ్డు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రతిరోజు ఒక కోడి గుడ్డు తినడం వల్ల అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు. కోడి గుడ్లలో ఐరన్, కాల్షియం, పొటాషియం వంటివి ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని ఇవ్వడమే కాకుండా ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిదని ఉన్నారు. ముఖ్యంగా, రక్త హీనత, కాల్షియ లోపంతో బాధపడేవారు ప్రతి రోజూ ఒక గుడ్డు తినాలని చెబుతున్నారు.
అయితే కొందరు కోడి గుడ్డు తినడ వలన గుండె సమస్యలు వస్తాయని అపోహపడి కోడి గుడ్డు తినడానికి అస్సలు ఇష్టపడరు. ఇది కేవలం అపోహ మాత్రమే అని, కోడి గుడ్డు తినడం వల్ల గుండెకు మేలు జరుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి కోడిగుడ్డు తినడం వల్ల గుండె సమస్యలు ఉన్నవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తక్కువ మోతాదులో కోడిగుడ్డు తిన్నవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందట.
మితిమీరి కాకుండా తక్కువ మొత్తంలో ఉడకబెట్టిన కోడిగుడ్లు తినడం వల్ల ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుందట. కొలెస్ట్రాల్ ఉన్నవారు కూడా ఎలాంటి భయం లేకుండా కోడి గుడ్డు తినవచ్చు అని చెబుతున్నారు. కొంత మంది రోజుకు ఒకటి తింటే మరికొంత మంది మాత్రం రోజుకు రెండు లేదా మూడు తింటుంటారు. కానీ ఇలా అధికంగా తినడం అస్సలే మంచిది కాదట. రోజుకు ఒక కోడి గుడ్డు తినడం ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు.
డయాబెటీస్ ఉన్నవారు, గుండె సమస్యలు ఉన్నవారు, కోడి గుడ్డులోని పచ్చ సొన తినకూడదట. దానిని తీసి తెల్లని గుడ్డుతినాలని చెబుతున్నారు. దీని వలన ఎలాంటి నష్టం కలగదని, ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు. శరీరానికి కావాల్సిన ప్రోటీన్, పోషకాలను అందిస్తుందని చెబుతున్నారు. కాబట్టి గుండె సమస్యలు ఉన్నవారు కోడిగుడ్డు తినకూడదు అన్నది కేవలం అపోహ మాత్రమే అని ఎలాంటి భయం లేకుండా తినవచ్చు అని చెబుతున్నారు.