Belly Fat: ఈ డ్రింక్ వారం రోజుల పాటు తాగితే చాలు బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరిగిపోవడం ఖాయం?
బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ని వారం రోజుల పాటు తాగితే చాలు అని చెబుతున్నారు. ఇంతకీ ఆ డ్రింక్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 11:00 AM, Thu - 1 May 25

ప్రస్తుత రోజుల్లో చాలా మంది బెల్లీ ఫ్యాట్ సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. స్త్రీ పురుషులు చాలామంది ఈ బెల్లీ ఫ్యాట్ సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ బెల్లీ ఫ్యాట్ ని కరిగించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయినప్పటికీ సరైన ఫలితాలు కలగక దిగులు చెందుతున్నారు.మీరు కూడా ఇలా బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్నట్లయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ తీసుకుంటే చాలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
బెల్లీ ఫ్యాట్ పెరగడానికి చాలా కారణాలు ఉండవచ్చు.
హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, తప్పుడు ఆహారపు అలవాట్లు, బలహీనమైన జీవక్రియ, థైరాయిడ్ అనేక ఇతర విషయాలు కారణం కావచ్చు. అయితే బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి మొదట మీరు తీసుకునే ఆహారం, జీవైన శైలి పై ఫోకస్ పెట్టాలట. బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే జామూన్ గింజలు, సోంపు గింజలు, మెంతి గింజలు, కొత్తిమీర గింజలను పొడిని చేసి నీటిలో కలుపుకుని తాగాలట. సోపు గింజలు ఇన్సులిన్ నిరోధకతను తగ్గించి, జీవక్రియను పెంచుతాయట. ఇది పొట్టలో పేర్కొన్న కొవ్వును సులభంగా కరిగిస్తుందట. బాడీ ఫ్యాట్ చాలా ఈజీగా తగ్గిస్తుందట. జామున్ గింజల పొడిని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుందట. ఈ విత్తనాలు రక్తంలో చక్కెర స్థాయిని కూడా నియంత్రిస్తాయి.
కొత్తిమీర గింజలు లిపిడ్ జీవక్రియను తగ్గించడం ద్వారా మొండి బొడ్డు కొవ్వును కరిగించడంలో సహాయపడే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఇది జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది. బరువు కూడా తగ్గిస్తుంది. మెంతి గింజల్లో కొవ్వును కాల్చే గుణాలు ఉన్నాయి. వాటి వినియోగం బరువును కూడా నియంత్రిస్తుంది. చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది. జామున్ గింజల పొడి 2 టేబుల్ స్పూన్లు,సోపు గింజల పొడి 4 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర పొడి 4 టేబుల్ స్పూన్లు, మెంతి గింజల పొడి 2 టేబుల్ స్పూన్లు నీరు – 200 మి.లీ తీసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న వస్తువులన్నింటినీ బాగా కలిపి ఒక పొడిని తయారు చేసుకోవాలట. ఈ పొడిని ఏదైనా కంటైనర్ లో స్టోర్ లో చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ పొడిని ఒక గ్లాసు నీటిలో వేసి కలుపుకొని తాగాలట. రెగ్యులర్ గా ఈ డ్రింక్ తాగడం వల్ల పొట్ట చాలా సులభంగా కరుగుతుందట.