Diabetes: షుగర్ పేషంట్లకు ఉదయం వ్యాయామంతో ఎలాంటి ప్రయోజనం లేదట..ఓ సర్వే..!!
- By hashtagu Published Date - 09:08 PM, Wed - 2 November 22
డయాబెటిస్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్య. భారత్ లోనూ డయాబెటిక్ పేషంట్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిపై ప్రభావం చూపుతుంది. దీనికి కారణం మన జీవనశైలి. కొందరి వంశపారపర్యంగా వచ్చినప్పటికీ…జీవన శైలి కూడా కారణం అవుతుంది. ఇప్పుడు డయాబెటిస్ అనేది సాధారణ వ్యాధిగా మారింది. కానీ దీన్ని అజాగ్రత్త చేస్తే ప్రాణాంతకంగా మారుతుంది. అయితే కొంతమంది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించుకునేందుకు ఉదయం వ్యాయామం చేస్తుంటారు. ఎన్నో రకాల వ్యాయామాలు చేస్తూ…జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఇన్సులిన్ తగ్గించడంతో ఉదయం వ్యాయామం వల ఎలాంటి ప్రయోజనం లేదని ఓ సర్వే వెల్లడించింది. మధ్యాహ్నం లేదా సాయంత్రం శారీరక శ్రమ వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రించడం ద్వారా మధుమేహం ప్రమాదం తగ్గుతుందని పేర్కొంది.
రోజంతా శారీరక శ్రమ షెడ్యూల్ను కలిగి ఉండటం వల్ల జీవక్రియ ఆరోగ్యాన్ని కాపాడుతుందని చాలా కాలంగా వాదించారు పరిశోధకులు. డయాబెటోలోజియాలో ప్రచురించబడిన ఒక కొత్త అధ్యయనం ఇప్పుడు మధ్యాహ్నం లేదా సాయంత్రం శారీరక శ్రమ మెరుగైన రక్తంలో చక్కెర నియంత్రణతో ముడిపడి ఉందని కనుగొంది. నెదర్లాండ్ కు చెందిన లైడెన్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ కు చెందిన డాక్టర్ జెరోయెన్ వాన్ డెర్ వెల్డే, క్లినికల్ ఎపిడెమియాలజీ విభాగం నుండి సహచరులు ఈ పరిశోధనకు నాయకత్వం వహించారు.
“ఇన్సులిన్ సున్నితత్వంపై శారీరక శ్రమ ప్రయోజనకరమైన ప్రభావాలకు రోజంతా శారీరక శ్రమ సమయం సంబంధితంగా ఉంటుందని ఫలితాలు సూచిస్తున్నాయి. టైప్ 2 మధుమేహం సంభవించడానికి శారీరక శ్రమ దోహదం చేస్తుందో లేదో తదుపరి అధ్యయనాలు అంచనా వేయాలి.” టైమింగ్ నిజంగా ముఖ్యమైనది.” అని పేర్కొన్నారు. ఈ పరిశోధన కోసం, పరిశోధకులు నెదర్లాండ్స్ ఎపిడెమియాలజీ ఆఫ్ ఒబేసిటీ (NEO) అధ్యయనం నుండి డేటాను ఉపయోగించారు.
ఈ పరిశోధనలో పాల్గొనేవారు శారీరక పరీక్ష చేయించుకున్నారు. ఈ సమయంలో ఉపవాసం, భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్, ఇన్సులిన్ స్థాయిలను కొలవడానికి రక్త నమూనాలను తీసుకున్నారు. మరింత స్పష్టంగా అర్థమయ్యేలా ఎంఆర్ఐ స్కాన్లు కూడా చేశారు. ఈ పరీక్షలో 35మంది పాల్గొన్నారు. అందులో కొందరు ఉదయం వ్యాయాయం చేశారు. మరికొందరు మధ్యాహ్నం, సాయంత్రం వ్యాయామం చేశారు. అయితే ఉదయం వ్యాయామం చేసిన వారి రక్తంలోని ఇన్సులిన్ లో ఎలాంటి మార్పులు కనిపించలేవు. కానీ మధ్యాహ్నం, సాయంత్రం వ్యాయామం చేసిన వారిలో మార్పులను గమనించారు. వారి రక్తంలో ఇన్సులిన్ స్థాయి బ్యాలెన్స్డ్ గా ఉంది. “మా అధ్యయనంలో విరామ సమయంలో సూచించే తీవ్రత జీవక్రియ ప్రతిచర్యలకు కారణం కావడానికి చాలా తేలికగా ఉండవచ్చు. రోజువారీ కార్యకలాపాలు కాంతి తీవ్రతతో ఉంటాయి. LPA, ఇన్సులిన్ నిరోధకత మధ్య ఎలాంటి తేడాను చూడలేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Related News
Weight Loss Drinks: ఈ సమ్మర్లో వెయిట్ లాస్ కావాలనుకుంటున్నారా..? అయితే ఈ డ్రింక్స్ ట్రై చేయండి..!
బరువు పెరగడం, ఊబకాయం వల్ల శరీరంలో అనేక వ్యాధులు వస్తాయి.