Lemon Tea: లెమన్ టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే?
ప్రస్తుత కాలంలో చిన్నవారి నుంచి పెద్దవారు వరకు టీ, కాఫీ లకు బాగా ఎడిక్ట్ అయిపోయారు. ఉదయం లేగవగానే కాఫీ
- By Anshu Published Date - 06:30 AM, Tue - 21 February 23

ప్రస్తుత కాలంలో చిన్నవారి నుంచి పెద్దవారు వరకు టీ, కాఫీ లకు బాగా ఎడిక్ట్ అయిపోయారు. ఉదయం లేగవగానే కాఫీ లేదా టీ తాగడం అలవాటు అయిపోయింది. దీంతో ఒక్కరోజు టీ కాఫీ లేకపోయినా కూడా ఆ రోజంతా ఏదో కోల్పోయినట్టుగా పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే టీ తాగడం వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో అనారోగ్య సమస్యలు కూడా అన్నే ఉన్నాయి. అతిగా టీ ని తాగడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. టీ లలో చాలా రకాల టీలు ఉన్నాయి. అందులో లెమన్ టీ కూడా ఒకటి.
చాలామంది లెమన్ తిను ఇష్టపడి తాగుతూ ఉంటారు. దీనిని తయారు చేసుకోవడానికి బ్లాక్ టీలో కొద్దిగా నిమ్మరసం పిండి, రుచి కోసం చక్కెర, సుగంధ ద్రవ్యాలు జోడించుకుంటూ ఉంటారు. మరి లెమన్ టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. లెమన్ టీ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి, విటమిన్ బీ6, మెగ్నీషియం,పొటాషియం వంటి పోషకాలు ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తాయి. శరీరాన్ని అలర్జీలు, ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుకోవచ్చు.
ఈ లెమన్ టీ ఆకుల్లో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మసౌందర్యానికి కూడా లెమన్ టీ సహా యపడుతుంది. ఈ టీలో ఫ్లేవనాయిడ్లు, పొటాషియం, మెగ్నీషియం, జింక్, రాగి, యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఇవి మన శరీరంలోని ఒత్తిడిని దూరం చేస్తాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. నిమ్మకాయ టీ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది అనేక శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.