HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Tender Tamarind Leaves Put A Stop To Those Problems

Tamarind leaves: చింత చిగురు ఆ సమస్యలకు చెక్ పెడుతుంది…!!

  • Author : Vamsi Chowdary Korata Date : 14-07-2026 - 4:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tender tamarind leaves put a stop to those problems...!!
Tender tamarind leaves put a stop to those problems...!!

చింతచిగురు పప్పు, చింతచిగురు రొయ్యలు, చింతచిగురు మటన్… ఇవన్నీ ఫేమస్ వంటకాలు. వేసవిలో ఇవి విరివిగా లభిస్తాయి. పుల్లగా ఉండే చింతచిగురుతో చేసుకునే వంటకాలు భలే టెస్టీగా ఉంటాయి. అంతేకాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చింతచిగురులో ఉండే ఔషధ గుణాలు శరీరానికి మంచి ఎనర్జీని అందిస్తాయి. అవేంటో తెలుసుకుందాం.

చింతచిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. అంతేకాదు, మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీర్ణాశయ సమస్యలను తగ్గిస్తుంది. ఫైల్స్ తో బాధపడుతున్నవారికి చింతచిగురు మంచి ఔషధంగా పనిచేస్తుంది. కడుపులో నులిపురుగులతో బాధపడే పిల్లలకు చింతచిగురుతో చేసిన ఆహారాన్ని తినిపిస్తే మంచిది. ఉదరభాగాన్ని ఆరోగ్యంగా ఉంచి ఉదర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. వేసవిలో అందుబాటులో ఉండే చింతచిగురును ఆహారంలో తీసుకుంటే ఎంతో మంచిది.

ఇక చింతచిగురులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. అంతేకాదు, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి శరీరాన్ని శుభ్రపరుస్తాయి. చింతచిగురును తీసుకుంటే ఎర్ర రక్తకణాల వృద్ధి జరుగుతుంది. రక్తాన్ని శుద్ధి చేసి గుండె జబ్బులు రాకుండా సహాయపడుతుంది. చింతచిగురులో ఉండే గుణాలు ఎముకలను బలోపేతం చేసి బలంగా మారుస్తాయి. కీళ్ల నొప్పులు, వాపులతో బాధపడేవారు చింతచిగురు పేస్టును కీళ్లపై కట్టులా కట్టుకుంటే ఎంతో ఉపశమనం లభిస్తుంది.

డయాబెటిస్‌తో బాధపడేవారికి చింతచిగురు మంచి పరిష్కారంగా సహాయపడుతుంది. రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గించి షుగర్ వ్యాధిని నియంత్రిస్తుంది. డయాబెటిస్‌తో బాధపడేవారు చింతచిగురును తీసుకుంటే మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి. ఇన్ఫెక్షన్ కారణంగా ఏర్పడిన గొంతు నొప్పి, మంట, వాపుల నుంచి ఉపశమనం కోసం ఉడికించిన చింతచిగురు నీటిని నోట్లో పోసుకుని పుక్కిలిస్తే మంచిది.

అంతేకాదు, నోటి పగుళ్లు, పూతలను కూడా తగ్గించే గుణం ఇందులో ఉంది. చింతచిగురును తీసుకుంటే కంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు జ్వరాన్ని కూడా తగ్గిస్తాయి. థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నవారు చింతచిగురుతో చేసిన ఆహార పదార్థాలను తరచూ తీసుకుంటే మంచి ఫలితం పొందవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • best health benefits
  • health tips
  • Tamirind leaves

Related News

    Latest News

    • Happier Life: ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటికి చోటివ్వండి..!!

    • Tamarind leaves: చింత చిగురు ఆ సమస్యలకు చెక్ పెడుతుంది…!!

    • Election Commission: ఏపీలో ‘SIR’ గడువు పెంపు!

    • Revanth Reddy: తెలంగాణ అభివృద్ధికి.. సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్!

    • AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd