Summer: వేసవికాలంలో ఈజీగా బరువు తగ్గాలి అంటే ఇలా చేయాల్సిందే!
వేసవి కాలంలో ఈజీగా బరువు తగ్గాలి అనుకున్న వారు తప్పకుండా కొన్ని నేచురల్ చిట్కాలను ఫాలో అవ్వాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 03:03 PM, Thu - 27 March 25

ఈ మధ్యకాలంలో బరువు తగ్గడం అన్నది ఒక టాస్క్ లా మారిపోయింది. బరువు పెరగడం సులువే కానీ బరువు తగ్గడం అన్నది చాలెంజింగ్ తో కూడుకున్న వ్యవహారం అని చెప్పాలి.. ఎంత కష్టపడినా ఎంత శ్రమించినా కూడా బరువు తగ్గడం అంత సులువు కాదు. బరువు తగ్గడం కోసం ఆహారం తీసుకోకుండా డైట్ పేరుతో కడుపులు మార్చుకుంటున్న వారు కూడా చాలామంది ఉన్నారు. ప్రస్తుతం సమ్మర్ కావడంతో ఈ సమ్మర్లో అలాంటి కష్టం ఏమీ లేకుండా సులువుగా ఈజీగా బరువు తగ్గి ఒక చిన్న చిట్కా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వేసవిలో బరువు తగ్గాలంటే పుచ్చకాయను తినాల్సిందే. ఊబకాయాన్ని తగ్గించడంలో పుచ్చకాయ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్న విషయం తెలిసిందే. ఇది కేలరీలు, చక్కెర , చాలా నీరు కలిగి ఉంటుంది. జ్యూసీగా ఉండే ఈ పండులో పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి దీన్ని తింటే కడుపు నిండుతుందట. దాంతో ఆకలిని ప్రేరేపించదు.అలా శరీర బరువు తగ్గుతుందట.
అలాగే కివి పండులో కూడా చక్కెర చాలా తక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందట. ఇది గుండె, పొట్టకు చాలా మేలు చేస్తుందని, అంతే కాకుండా కివి జీవక్రియను మెరుగుపరుస్తుందని, బరువు తగ్గడంలో గొప్పగా సహాయపడుతుందని చెబుతున్నారు.
కాగా విటమిన్ సి పుష్కలంగా ఉండే నారింజ పండు వేసవిలో బరువు తగ్గడానికి మంచి మార్గం అని చెప్పాలి. ఇది బరువు తగ్గించడమే కాకుండా బ్లడ్ లో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేస్తుందట. ఎందుకంటే ఇందులో కేలరీలు, చక్కెర చాలా తక్కువగా ఉంటాయి.
వేసవికాలంలో ఎక్కువగా దొరికే వాటిలో కీర దోసకాయ కూడా ఒకటి. ఇందులో నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుందట. బరువును సులభంగా తగ్గిస్తుందట. అంతే కాకుండా వేసవిలో కీర దోసకాయ తింటే డీహైడ్రేషన్ రాదట. కాబట్టి ఈ నాలుగు రకాల పండ్లు కనుక మీ డైట్ లో భాగం చేసుకుంటే ఈజీగా బరువు తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.