Butter Milk: వేసవికాలం కదా అని మజ్జిగను తెగ తాగేస్తున్నారా.. అయితే ఇది మీకోసమే!
ఎండాకాలం మజ్జిగ తాగితే మంచిది కదా అని ఎక్కువగా తాగితే మాత్రం సమస్యలు తప్పవు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
- By Anshu Published Date - 11:03 AM, Thu - 20 February 25

మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మజ్జిగ తాగడం వల్ల అనేది రకాల లాభాలు పొందవచ్చు. ముఖ్యంగా వేసవికాలంలో మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డిహైడ్రేషన్ వంటి సమస్యల నుంచి బయట పడేస్తాయి. మజ్జిగ ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు ఏ, డి ల అద్భుతమైన మూలం. ఇందులో కాల్షియం, విటమిన్ బి12, జింక్, రిబోఫ్లేవిన్, ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. చాలామంది ఎండాకాలంలో మజ్జిగ తాగడం మంచిదని ఎక్కువగా తాగుతుంటారు.
అయితే మంచిదే కదా అని ఎండాకాలంలో ఎక్కువగా తాగితే మాత్రం సమస్యలు తప్పవు అని చెబుతున్నారు. మరి ఎండాకాలంలో మజ్జిగ ఎక్కువగా తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కడుపుకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు అల్పాహారంగా మజ్జిగ తాగవచ్చట. ఉదయం ఖాళీ కడుపుతో మజ్జిగ తాగడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ వంటి కడుపు సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. మజ్జిగ ద్వారా లభించే విటమిన్ ఏ మీ కంటి చూపును బలంగా ఉంచడంలో సహాయపడుతుందట. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందట.
గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు వంటి అంతర్గత అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతున్నారు. మజ్జిగను చిలికిన తర్వాత అందులో మిగిలిపోయిన బ్యాక్టీరియా లాక్టోస్ ను లాక్టిక్ ఆమ్లంగా మార్చడానికి సహాయపడుతుంది. దీనివల్ల లాక్టోస్ అసహనం ఉన్నవారు దానిని జీర్ణం చేసుకోవడం సులభం అవుతుంది. మజ్జిగ రిబోఫ్లేవిన్ ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది అమైనో ఆమ్లాలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. శరీరానికి అవసరమైన ప్రోటీన్లను తయారు చేయడానికి అమైనో ఆమ్లాలు ముఖ్యమైనవి. మజ్జిగలో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల సమస్యలు ఉన్న రోగులకు మంచిది కాదట. మీరు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతుంటే దీనిని తాగడం మానుకోవాలని చెబుతున్నారు. మజ్జిగ మీ జలుబును మరింత తీవ్రతరం చేస్తుందట. జ్వరం, జలుబు, పుప్పొడి అలెర్జీ ఉన్నప్పుడు రాత్రిపూట మజ్జిగ తాగడం మంచిది కాట.