HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Suffering From Migraine Headaches Then Try These Asanas

Migraine : మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నారా? అయితే ఈ ఆసనాలను ట్రై చేయండి

మైగ్రేన్ అనేది నాడీ సంబంధిత సమస్య. ఇది తక్కువ నుంచి ఎక్కువ అయ్యే తీవ్ర తలనొప్పికి (Head Ache) కారణమవుతుంది.

  • By Maheswara Rao Nadella Published Date - 05:00 PM, Mon - 9 January 23
  • daily-hunt
Migraine Symptoms
Migraine Symptoms

మైగ్రేన్ (Migraine) అనేది నాడీ సంబంధిత సమస్య. ఇది తక్కువ నుంచి ఎక్కువ అయ్యే తీవ్ర తలనొప్పికి కారణమవుతుంది. సాధారణంగా, ఇది తలలో సగం భాగాన్ని మాత్రమే ప్రభావితం చేస్తుంది. 2 గంటల నుండి 2 రోజుల కంటే ఎక్కువ సేపు ఉంటుంది. మైగ్రేన్ (Migraine) వచ్చినప్పుడు, వెలుతురు, సౌండ్ వస్తే తట్టుకోవడం కాస్తా కష్టంగా ఉంటుంది. వాంతులు, వికారం, తలనొప్పి వంటి సమస్యలు ఉంటాయి. అయితే ఇది తగ్గించేందుకు ఎలాంటి టిప్స్ పాటించాలి.. ట్రీట్‌మెంట్ ఏంటి?..కొన్ని రోజుల కొద్దీ మైగ్రేన్‌తో బాధపడుతుంటే.. మీ నొప్పిని అధిగమించేందుకు మందులు కాకుండా ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. ఆర్టరీస్ సర్జరీ, మజిల్ సర్జరీ, ఆక్సిపిటల్ నెర్వ్ స్టిమ్యులేషన్, బొటాక్స్, బేటా బ్లాకర్స్, యాంటీ డిప్రజెంట్స్ అనేవి మైగ్రైన్‌కి ట్రీట్‌మెంట్స్.

కానీ, ఈ ట్రీట్‌మెంట్ పద్దతులతో కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్‌ ఉంటాయి. ఈ పద్ధతుల్లో కొన్నింటి ద్వారా హైపోటెన్షన్, గుండెపోటులు, నిద్రలేమి, వికారం వంటి ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి, సహజంగానే మైగ్రేన్‌ని తగ్గించుకునేందుకు కొన్నింటిని ఎంచుకోవచ్చు. అందులో ముందుగా ఉండేది యోగా. అవును.. ఆసనాలు చేయడం వల్ల మైగ్రేన్ (Migraine) చాలా వరకూ తగ్గుతుంది. అలాంటి 8 ఆసనాల గురించి చూద్దాం.

హస్తపాదాసన:

Hasta Padasana | Hand-To-Foot-Pose | Migraine

దీనినే ఇంగ్లీష్‌లో స్టాండింగ్ ఫార్వర్డ్ బెండ్ అంటారు. ఇది చేయడం వల్ల రక్త సరఫరా పెరిగి నాడీ వ్యవస్త ఉత్తేజమవుతుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది.

ఎలా చేయాలంటే:

యోగా మ్యాట్‌పై ముందుగా నిలుచిని రెండు చేతులని మెల్లిగా కిందికి తీసుకొస్తూ వంగాలి. ఆ తర్వాత రెండు చేతులను మీ కాళ్ళకు రెండువైపులా పెట్టాలి. ఇలా కాసేపు ఉండి యథస్థానానికి రావాలి.

సేతు బంధాసన:

Setubandhasana | Migraine

దీనినే ఇంగ్లీష్‌లో బ్రిడ్జ్ పోజ్ అంటారు. ఇది మీ బ్రెయిన్‌ని శాంత పరిచి రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. మీ రక్తపోటును నియంత్రించి, ప్రశాంతతని ఇస్తుంది. ఇది చేసేటప్పుడు రక్తం మెదడుకి సరఫరా అయి నొప్పి తగ్గుతుంది.

ఎలా చేయాలంటే:

ముందుగా మ్యాట్‌పై పడుకుని కాళ్ళని మడవాలి. ఆ తర్వాత చేతులతో కాళ్ళని పట్టుకుని మీ నడుము భాగాన్ని పైకి లేపాలి.

శిశుఆసన:

Child Pose (Shishuasana) | Migraine

దీనినే ఇంగ్లీష్‌లో చైల్డ్ పోజ్ అంటారు. ఇది చేయడం వల్ల నాడీ వ్యవస్థ శాంతపరిచి నొప్పి తగ్గుతుంది. ఒత్తిడి దూరమవుతుంది. నడుము, తొడలు, చీలమండలాన్ని సాగదీస్తం కాబట్టి మెదడు రిలాక్స్ అయి ఒత్తిడి, అలసట దూరమవుతుంది. దీని వల్ల నరాల పనితీరు కూడా మెరుగ్గా మారుతుంది.

ఎలా చేయాలంటే:

ముందుగా కాళ్ళను మడిచి కూర్చోవాలి. ఇప్పుడు మెల్లిగా బాడీని వంగి ముందువైపుకి బోర్లా పడుకోవాలి. చేతులని కాళ్ళకి ఇరువైపులా పెట్టాలి.

మార్జారి ఆసన:

Ashtanga Yoga: Marjariasana (Cat Pose) | Migraine

ఇది చూడ్డానికి పిల్లిలా ఉంటుంది కాబట్టి. క్యాట్ స్ట్రెచ్ అంటారు. దీనిని చేయడం వల్ల మెదడు రిలాక్స్ అయి ఒత్తిడి దూరమవుతుంది. శ్వాస ప్రక్రియలు సరిగ్గా ఉంటాయి. కండరాల నొప్పి దూరమయ్యేందుకు ఇది సాయపడుతుంది.

ఎలా చేయాలంటే:

ముందుగా మోకాళ్ళని మడిచి కూర్చోవాలి. ఇప్పుడు చేతులని ముందుకు మడిచి ఫొటోలో ఉన్న విధంగా ఉండాలి. ఇదే పొజిషన్‌లో కాసేపు ఉండాలి. తిరిగి యథాస్థానానికి రావాలి.

పశ్చిమోత్తనాసన:

How to do Paschimottanasana (Seated Forward Bend) - YouTube

దీనినే ఇంగ్లీష్‌లో టూ లెగ్డ్ ఫార్వర్డ్ బెండ్ అంటారు. రెండు కాళ్ళు ముందుకు వచ్చే ఈ ఆసనం మెదడుని ప్రశాంతంగా ఉంచి, ఒత్తిడి, తలనొప్పి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

ఎలా చేయాలంటే:

ముందుగా కాళ్ళని చాపి కూర్చోవాలి. ఇప్పుడు తలభాగాన్ని ముందుకు వంచుతూ చేతులతో కాళ్ళని పట్టుకోవాలి.

అధోముఖ స్వానాసన:

Yoga Asana - Adho Mukha Svanasana (Downward Facing Dog Pose) - Relieves  Stress & Depression - YouTube

దీనినే ఇంగ్లీష్‌లో డౌన్‌వార్డ్ ఫేసింగ్ డాగ్ పోజ్ అంటారు. దీనిని చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగ్గా మారి తలనొప్పి తగ్గుతుంది.

ఎలా చేయాలంటే:

ముందుగా నిల్చోవాలి. ఇప్పుడు మెల్లిగా వంగుతూ చేతుల్ని నేలపైకి తాకించి మన శరీరం మొత్తం త్రిభుజం ఆకారంలో ఉండేలా చూసుకోండి.

పద్మాసన:

Padmasana Yoga | Lotus Pose Yoga | Steps | Benefits | Yogic Fitness -  YouTube

దీనినే లోటస్ పోజ్ అని కూడా అంటారు. ఇది చేయడం వల్ల మనసుకి ప్రశాంతంగా ఉండి తలనొప్పి తగ్గుతుంది.

ఎలా చేయాలంటే:

ముందుగా కాళ్ళు మడిచి కూర్చోవాలి. రెండు చేతులని రెండు కాళ్ళపై పెట్టి ఊపిరి తీస్తూ వదలాలి.

శవాసన:

Savasana | Yoga Posture | Corpse Pose - YouTube

దీనినే కార్పస్ పోజ్ అంటారు.శవాసనం చేయడం వల్ల ధ్యాన ముద్రలో శరీరం ఉంటుంది. దీని వల్ల శరీరానికి ఉత్తేజం అందుతుంది. ఈ ఆసనంతో యోగా చేయడం పూర్తైనట్లే.. అయితే, ఇవన్నీ మీకు మీరుగా కాకుండా నిపుణుల సలహాతో చేయడం ఉత్తమం. ఎందుకంటే కొన్ని భంగిమలు స్వతహాగా చేయడం అంత మంచిది కాదు.

Also Read:  Apple Store : ముంబై ఢిల్లీలో ఆపిల్ స్టోర్.. ఉద్యోగుల కోసం నోటిఫికేషన్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • food
  • Head Ache
  • health
  • Life Style
  • migraine
  • Pain
  • yoga

Related News

Insomnia

Insomnia: నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా? అది వ్యాధి కాదు!

జ్యోతిష్యం ప్రకారం.. మీకు రాత్రిపూట నిద్ర రాకపోవడం, ఒత్తిడి, తప్పుడు ఆలోచనలు వంటి సమస్యలు ఉంటే మీ చంద్రుడు, బుధుడు, శని, రాహువులు సరిగా లేవని అర్థం చేసుకోవాలి. స్క్రీన్ టైమ్‌ను తగ్గించండి.

  • Dharmendra Death Cause

    Dharmendra Death Cause: వయసు పెరుగుతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎందుకు వస్తుంది?

  • Peanuts

    Peanuts: చలికాలంలో ప‌ల్లీలు ఎవ‌రు తిన‌కూడ‌దు?!

  • Protect Baby

    Protect Baby: మీ ఇంట్లో న‌వ‌జాత శిశువు ఉన్నారా? అయితే ఈ టిప్స్ మీకోస‌మే!

  • Coriander Leaves

    Coriander Leaves: ఏడు రోజులు కొత్తిమీర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!

Latest News

  • Cyclone Ditwah to bring Heavy Rains to AP : ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – హోంమంత్రి అనిత

  • Mutual Fund : ఈక్విటీల్లో కొత్త స్కీమ్స్ లాంచ్..లిస్ట్‌లో చేరిన టాటా ఫండ్..సబ్‌స్క్రిప్షన్ డేట్ ఫిక్స్!

  • Amaravati Construction : 2028 మార్చికి అమరావతి నిర్మాణం పూర్తి తేల్చేసిన చంద్రబాబు

  • Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!

  • Kutami Government : కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తుంది – పవన్

Trending News

    • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

    • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

    • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd