Exercise: ఖాళీ కడుపుతో వ్యాయామం చేయవచ్చా?చేయకూడదా?
ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి రోజు వ్యాయామం, యోగ తప్పనిసరి. జిమ్ కి వెళ్లడం వ్యాయామం చేయడం లాంటివి
- By Nakshatra Published Date - 08:58 PM, Fri - 14 April 23
ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి రోజు వ్యాయామం, యోగ తప్పనిసరి. జిమ్ కి వెళ్లడం వ్యాయామం చేయడం లాంటివి చేయడంతో పాటు సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. దాంతోపాటుగా చేయాల్సిన మరొక ముఖ్యమైన పని కంటి నిండా నిద్రపోవడం. ఈ బిజీబిజీ షెడ్యూల్ వల్ల చాలామంది ఉదయాన్నే ఒక గంట అర్ధగంట వ్యాయామం ఎక్ససైజ్ కోసం కేటాయిస్తే ఇంకొందరు మాత్రం పక్కన పెట్టేస్తూ ఉంటారు. ప్రతి రోజూ గంట సేపు వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయడం మంచిదే కానీ, కాళీ కడుపుతో వ్యాయామం చేయవచ్చా లేక వ్యాయామానికి సరిపడా శక్తిని సమకూర్చుకున్న తర్వాత వ్యాయామం చేయాలా అన్న సందేహాలు తలెత్తుతూ ఉంటాయి.
ఈ విషయాల గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వ్యాయామానికి ముందైనా పొట్ట నిండుగా ఉండకూడదు. సాధారణంగా ఉదయం చేసే వర్కవుట్లు గంటకు మించి కొనసాగవు. ఈ పాటి వ్యాయామానికి సరిపడా శక్తి మన శరీరానికి ఉంటుంది. కండరాల్లో, కాలేయంలో నిల్వ ఉండే గ్లైకోజన్ ద్వారా వ్యాయామానికి అవసరమైన శక్తి అందుతుంది. ఈ విషయంపై నిపుణులు ఒక అధ్యయనం జరుపగా అల్పాహారం తిన్న తర్వాత వ్యాయామంలో పాల్గొన్న వారి శరీరంలో వ్యాయామానికి అవసరమైన శక్తి వారి శరీరంలో ముందు నుంచీ నిల్వ ఉన్న చక్కెర నిల్వల నుంచే సమకూరినట్టు తేలింది.
అలాగే ఖాళీ కడుపుతో వ్యాయామం చేసినవాళ్లు ఆ తర్వాత అవసరానికి మించి ఆహారం తీసుకోలేరు. అంతేకాకుండా ఇలా ఖాళీ కడుపుతో వ్యాయామం చేసినవాళ్లలో, అల్పాహారం తీసుకున్నవారి కంటే 20శాతం క్యాలరీలు ఎక్కువ ఖర్చు అయ్యాయి. కాబట్టి ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల కొవ్వు అధికంగా కరుగుతున్నట్లు తేలింది. కాబట్టి ఉదయం పూట వ్యాయామాలు చేసేవాళ్లు ఖాళీ కడుపుతోనే మొదలుపెట్టడం మంచిది.
Related News
Fitness : తిన్న తర్వాత మీకు నిద్ర వస్తోందా? అయితే.. ఇలా ప్రయత్నించండి..!
భోజనం చేసిన తర్వాత నిద్రపోవడం పనిలో మీ ఉత్పాదకతను ప్రభావితం చేస్తుంది.