Spearmint: ప్రతిరోజు ఉదయాన్నే పుదీనా తినడం వల్ల కలిగే లాభాలు ఇవే?
పుదీనా వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. దీని వాసనే చాలా ఘాటుగా ఉంటుంది. ఈ పుదీనాని ఎన్నో రకాల వంటల్లో
- Author : Anshu
Date : 06-02-2024 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
పుదీనా వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. దీని వాసనే చాలా ఘాటుగా ఉంటుంది. ఈ పుదీనాని ఎన్నో రకాల వంటల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పుదీనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుదీనాని తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా పుదీనా అజీర్తి, గ్యాస్ జీర్ణ సంబంధిత సమస్యలకు ఎంతో బాగా పనిచేస్తుంది. మాములుగా కడుపులో గ్యాస్ సమస్య వల్ల కలిగే బాధ గురించి చెప్పనక్కర్లేదు. ఈ సమస్య నుండి బయటకు పడటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటాము.
ఈ గ్యాస్ సమస్య నుంచి బయటపడడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసినా కేవలం అవి తాత్కాలికం మాత్రమే. అంతేకాకుండా వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. కాగా ఈ గ్యాస్ సమస్యతో బాగా బాధపడుతున్నప్పుడు గాలిని ఎక్కువగా పిలుస్తూ వాకింగ్ చేయడం వల్ల కడుపులో ఉండే గ్యాస్ ఈజీగా బయటకు పోతుంది. అలాగే నీటిలో పుదీనా ఆకులను ఇంకా కొంచం అల్లం ముక్కలు వేసి బాగా మరిగించి ఈ నీటిని తాగడం వల్ల కూడా ఈ సమస్య నుంచి చాలా ఈజీగా బయటపడవచ్చు. ఇక మనకు బయట అల్లం రవ్వ కూడా దొరుకుతూనే ఉంటుంది.
ప్రతిరోజు ఉదయం కూడా దీనిని కొద్ది పరిమాణంలో తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ సమస్య అనేది రాకుండా ఉంటుంది. అల్లం నీటిలో 1 గంటపాటు జీలకర్రను నానబెట్టి తర్వాత నీటిని వడకట్టి జీలకర్రను ఎండబెట్టాలి. ఎండిన తర్వాత దీనిని పొడిగా చేసి తడి లేని గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఇలా నిలువ చేసుకున్న పొడిని ప్రతి రోజు కూడా అర టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగటం వల్ల కడుపులో గ్యాస్ ఇంకా అలాగే కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా ఈజీగా తగ్గిపోతాయి. ఆ వడకట్టిన నీరును కూడా తాగాలి. ఇలా 15 రోజులు పాటు చేస్తే గ్యాస్ సమస్య అస్సలు రాదు.