Health Tips: రోజులో ఎక్కువ సేపు కుర్చీలో కూర్చొని పనిచేస్తున్నారా.. అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
ఎక్కువసేపు గంటల తరబడి ఒకే పొజిషన్ లో కూర్చొని పనిచేస్తే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో, ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 11:34 AM, Mon - 12 May 25

కంప్యూటర్ ముందు లాప్టాప్ ల ముందు కూర్చుని పని చేసేవారు, ఆఫీస్ వర్క్ చేసేవారు ఎక్కువసేపు కుర్చీలో కూర్చొని పనిచేస్తూ ఉంటారు. అయితే ఇది ఎన్నో రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది అని చెబుతున్నారు. ముఖ్యంగా ఎనిమిది నుంచి 12 గంటల సేపు కూర్చొని పనిచేసేవారు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందట రోజుల్లో దాదాపు అందరూ చేసేవి కూర్చొని చేసే పనులే. రోజులో గంటలు గంటలు కుర్చీల్లో కూర్చొని పనులు చేస్తున్నారు. కూర్చొని పని చేయడం కూడా కష్టమేనా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ కూర్చొనే పద్దతి సరిగా లేకపోతే మాత్రం సమస్యలు తప్పవు.
కాగా ఈ రోజుల్లో చాలా మంది రోజుల్లో దాదాపు 8 నుంచి 12 గంటలు కుర్చీలో కూర్చొని పని చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. అయితే కుర్చీలో సరిగా కూర్చోకపోయినా, ఆ కుర్చీ సరిగా లేకపోయినా తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందట. ఎటువంటి కదలిక లేకుండా ఎక్కువసేపు కుర్చీపై కూర్చుంటే అధిక బరువు పెరిగే ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అలాగే శరీరం ఊబకాయానికి దారి తీస్తుందట. మీరు సరిగ్గా కుర్చీపై కూర్చోకుండా గంటల తరబడి పని చేస్తే, అది మీ ఏకాగ్రతను తగ్గిస్తుందట. కూర్చోవడం వల్ల కూడా కాళ్ళకు రక్త ప్రసరణను అడ్డుకుంటుందట.
కుర్చీపై కూర్చొని కంప్యూటర్ లో పని చేస్తూ, కీబోర్డ్ పై నిరంతరం వేళ్లను కదిలించే వ్యక్తులు చేతులు, భుజాలలో నొప్పిని అనుభవిస్తారట. అదేవిధంగా గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం కూడా రక్త ప్రసరణపై ప్రభావం చూపుతుందట. ముఖ్యంగా కుర్చీపై కూర్చొని పని చేస్తున్నప్పుడు భుజాలు, పొత్తికడుపు, తుంటి భాగాల్లో రక్తప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల శరీరంలో జలదరింపు లేదా తిమ్మిరి వంటి సాధారణ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కూర్చున్న కుర్చీ మీ దిగువ వీపుకు మద్దతు ఇవ్వకపోతే , మీరు వెనుక మద్దతు లేకుండా కుర్చీపై కూర్చుంటే, అది మీ తుంటిలో నొప్పిని కలిగిస్తుందట. ఈ నొప్పి మెడ నుండి మొదలై వెన్ను ఎముక వరకు వెళుతుందట. ఎక్కువసేపు అలాగే కూర్చోవడం వల్ల నడుము నొప్పి వంటి సమస్యలు వస్తాయట. కాబట్టి కూర్చొని పని చేసేవారు ఎక్కువసేపు కూర్చోకుండా కనీసం రెండు గంటలకు ఒక్కసారైనా అలా లేచి తిరుగుతూ ఉండాలని చెబుతున్నారు.