Nails : గోర్లు కొరికేవారికి షాకింగ్ న్యూస్.. దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే చాన్స్
Nails : గోర్లు కొరకడం అనేది చాలామందిలో కనిపించే అలవాటు. ఇది సాధారణంగా ఒత్తిడి, ఆందోళన లేదా బోర్ అనిపించినప్పుడు చేస్తుంటారు.
- By Kavya Krishna Published Date - 10:00 PM, Thu - 4 September 25

Nails : గోర్లు కొరకడం అనేది చాలామందిలో కనిపించే అలవాటు. ఇది సాధారణంగా ఒత్తిడి, ఆందోళన లేదా బోర్ అనిపించినప్పుడు చేస్తుంటారు. అయితే, ఈ అలవాటు మన ఆరోగ్యానికి చాలా నష్టాలను కలిగిస్తుంది. గోర్లు కొరకడం వల్ల కేవలం వేళ్లకు మాత్రమే కాకుండా, మన శరీరం మొత్తానికి హాని కలుగుతుంది. దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.
గోర్ల శుభ్రంగా ఉన్నాయా? లేదా..
మనం రోజంతా చేతులతో ఎన్నో వస్తువులను తాకుతాం. ఈ క్రమంలో, చేతులు, గోర్ల కింద కోట్లాది క్రిములు, బ్యాక్టీరియాలు పేరుకుపోతాయి. గోర్లు కొరికినప్పుడు, ఈ క్రిములు మన నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల జలుబు, జ్వరం వంటి చిన్నపాటి అనారోగ్య సమస్యల నుండి టైఫాయిడ్, కాలేయ వ్యాధులు వంటి తీవ్రమైన రోగాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే గోర్లు కొరకరాదని మన పెద్దలు చెబుతుంటారు. కానీ చాలా మంది దాన్ని పట్టించుకోరు. అంతేందుకు పిల్లలతో పాటు కొందరు పెద్దలకు కూడా గోర్లు కొరికే అలవాటు ఉంటుంది. గోర్లు కొరకడం మంచిది కాదని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.
Good News: గుడ్ న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం.. మరో హామీ అమలు!
ముఖ్యంగా ఇన్ఫెక్షన్లు సోకే చాన్స్..
గోర్లు కొరకడం వల్ల దంతాలు కూడా దెబ్బతింటాయి. గోర్లు కొరికినప్పుడు పళ్ల మధ్య ఒత్తిడి పెరిగి అవి అరిగిపోవడం, చిప్ అవ్వడం జరగవచ్చు. అలాగే, చిగుళ్లలో ఇన్ఫెక్షన్లు కూడా రావచ్చు. ఈ అలవాటు వల్ల దవడ కీలు (TMJ) సమస్యలు కూడా వస్తాయి, దీనివల్ల దవడ కదలించడం కష్టంగా మారుతుంది, నొప్పి కూడా ఉంటుంది.
దీర్ఘకాలికంగా గోర్లు కొరకడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు వస్తాయి. గోర్ల కింద ఉన్న బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్లు, గ్యాస్ట్రోఎంటెరిటిస్ వంటి సమస్యలు వస్తాయి. ఈ అలవాటు ఉన్నవారికి తరచుగా కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా, దీనివల్ల గోర్ల చుట్టూ ఉన్న చర్మం కూడా దెబ్బతింటుంది. మరికొందరికి గోర్ల పక్కన ఉండే స్కిన్ లేచిపోవడం వలన రక్తస్రావం కూడా అయ్యే అవకాశం ఉంది. దాని వలన తినడం కూడా ఇబ్బంది అవుతుంది.. ఏదైనా కారంగా ఉండే వస్తువులు ముట్టుకున్నప్పుడు మంట తీవ్రతరం అవుతుంది.
ఈ అలవాటును మానుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. గోర్లను తరచుగా కత్తిరించడం, చేతులకు రుచీ లేని నెయిల్ పాలిష్ వేసుకోవడం వంటివి చేయొచ్చు. అలాగే, ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయొచ్చు. గోర్లు కొరకడం అనేది చిన్న అలవాటుగా కనిపించినా, ఇది మన ఆరోగ్యంపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి, ఈ అలవాటును వీలైనంత త్వరగా మానుకోవడం మంచిది. గోర్లు కొరికే అలవాటు ఉన్నవారు దానికి బదులుగా బబుల్ గమ్ లాంటివి అలవాటు చేసుకుంటే ఈ అలవాటు నుంచి బయట పడొచ్చు.
Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 5వేల మంది ఎంపిక!