HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Pulses Are Nutrition Rich And Affordable For The Poor

Pulses: తినండి పప్పు.. ఇక ఉండదు ముప్పు..!

పప్పులను (Pulses) పేదవాడి మాంసం అని పిలుస్తారు. ఇవి మన శరీరానికి పోషక పదార్థాలతో పాటు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. పప్పులలోని పోషకాలలో 25 శాతానికిపైగా ప్రోటీన్స్ (మాంసకృత్తులు) ఉంటాయి.

  • Author : Gopi Date : 18-02-2023 - 9:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
pulses
Resizeimagesize (1280 X 720) (1) 11zon

పప్పులను (Pulses) పేదవాడి మాంసం అని పిలుస్తారు. ఇవి మన శరీరానికి పోషక పదార్థాలతో పాటు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. పప్పులలోని పోషకాలలో 25 శాతానికిపైగా ప్రోటీన్స్ (మాంసకృత్తులు) ఉంటాయి. ఒక కప్పు పప్పులో కనీసం 18 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.ఐరన్, జింక్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, బి విటమిన్లు వంటి సూక్ష్మపోషకాలకు పప్పులు మంచి మూలం. అందుకే చాలామంది వ్యక్తులు ఈ పోషకాల కోసం వాటిని తమ ఆహారంలో చేర్చుకుంటారు.

■ పాలీఫెనాల్స్ .. సూపర్ ప్రొటెక్షన్

శరీరంలోని హానికరమైన ఏజెంట్లకు వ్యతిరేకంగా పోరాడే చురుకైన సమ్మేళనాలను పాలీఫెనాల్స్ అంటారు. ఇవి మన బాడీలో ఏర్పడేందుకు పప్పులు హెల్ప్ చేస్తాయి.పాలీఫెనాల్స్ అనేవి క్యాన్సర్ కణాలు శరీరంలో ఏర్పడకుండా నిరోధిస్తాయి. గుండె ఆరోగ్యం బెటర్ గా ఉండేలా హెల్ప్ చేస్తాయి. షుగర్ వ్యాధి రాకుండా కూడా పాలీఫెనాల్స్ రక్షణ కల్పించగలవు.

■ ఐరన్

ఒక కప్పు పప్పులో 6.5 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. ఇది మీకు రోజంతా అవసరమైన ఐరన్ లో మూడింట ఒక వంతుకు సమానం. మీ శరీరంలో ఆక్సిజన్ పంపింగ్‌ ప్రక్రియను సవ్యంగా ఉంచడానికి ఐరన్ హెల్ప్ చేస్తుంది. ఇంత ముఖ్యమైన ఐరన్ ను మీ బాడీకి అందించే పప్పును ఇక తినండి.

■ ఫోలిక్ యాసిడ్‌

పప్పులో ఫోలిక్ యాసిడ్‌ కూడా పుష్కలంగా ఉంటుంది. గర్భిణులకు ఇది చాలా అవసరం.

■ ఫైబర్

ఒక కప్పు పప్పులో కనీసం 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. దీనివల్ల పప్పు తిన్న తర్వాత ఎక్కువసేపు కడుపు నిండుగా అనిపిస్తుంది.

■ యాంటీ ఆక్సిడెంట్లు

యాంటీ ఆక్సిడెంట్లకు పప్పులు మంచి మూలం. వీటిలో  ఫ్లేవనాయిడ్లు , పాలీఫెనాల్స్ అనే
యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఉండటం వల్ల పప్పులను యాంటీకార్సినోజెన్‌లు అని పిలుస్తారు.

■ గుండెకు పప్పుల రక్షణ ఇలా..

పప్పులలో ఉండే ఫైబర్ మన రక్తప్రవాహంలో చక్కెర శోషణ ప్రక్రియను స్లో చేస్తుంది. పప్పులో కరిగే ఫైబర్, కరగని ఫైబర్ రెండూ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని కరిగే ఫైబర్ మన బాడీలోని గట్‌లో ఉన్న కొలెస్ట్రాల్‌ ను చుట్టుకొని దాన్ని బయటకు సాగనంపుతుంది.

■ B విటమిన్ల స్టోర్‌హౌస్

విటమిన్ B అనేది మనం తినే ఆహారాన్ని శక్తిగా మార్చడంలో సహాయం చేస్తుంది.  ఉదాహరణకు.. విటమిన్ B7 అనేది ముఖ్యంగా జుట్టు, చర్మ ఆరోగ్యానికి ఎంతో కీలకమైంది. విటమిన్ B12 అనేది ఎర్ర రక్త కణాలు, DNA ఏర్పడటానికి హెల్ప్ చేస్తుంది. నిజానికి, ఒక బౌల్ మూంగ్ పప్పులో మీ బాడీకి ఒక రోజులో అవసరమైన విటమిన్ బీ( ఫోలేట్ ) లో 100% ఉంటుంది.

■ మినపపప్పు

మినపపప్పులో ప్రోటీన్, విటమిన్ B3 గొప్ప మూలం. అవి మన ఎముకలను దృఢంగా చేస్తాయి.

■ శనగపప్పు

శనగపప్పులో మాంసకృత్తులు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుతుంది.

■ కంది పప్పు

కంది పప్పులో మాంసకృత్తులు బాగా ఉంటాయి. ఫైబర్, ఫోలిక్ యాసిడ్, ఐరన్, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి.

■ పెసర పప్పు

పెసర పప్పులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్త ప్రసరణను ప్రోత్సహించడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పొటాషియం, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఇవి కండరాల తిమ్మిరిని నివారిస్తాయి.

■ మైసూర్ పప్పు

మైసూర్ పప్పులో కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మిమ్మల్ని చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. దీనిలోని పోషకాలు సెల్ డ్యామేజ్‌ని తగ్గించి, వృద్ధాప్యాన్ని నిరోధించడంలో సహాయపడతాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Groundnut
  • health tips
  • nutrition
  • Peas dal
  • Pulses

Related News

Here are the health benefits of eating these nuts daily... Once you know their benefits, you won't be able to resist eating them!

Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

కాసేపు పనిచేయగానే అలసిపోతున్నారా..? ఏమాత్రం ఓపిక ఉండట్లేదా? రోగనిరోధక శక్తి క్షీణిస్తోందా? అయినా నో ప్రాబ్లం..! రోజుకు మూడు బ్రెజిల్ నట్స్ తింటే మీలోని ఈ సమస్యలన్నీ దాదాపు రెండు వారాల్లో తగ్గిపోతాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే.. వాటిలో శరీరానికి అత్యవసరమైన సెలీనియం సమృద్ధిగా ఉంటుంది. ఇది నేలలో, నీటిలో మరియు కొన్ని ఆహారాలలో లభించే ముఖ్యమైన పోషకం. ఇది మార్కెట్లలో

  • Have you never drunk goat milk? Once you know this, you'll start drinking it immediately!

    Goat Milk: మేకపాలు ఎప్పుడూ తాగలేదా? ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మొదలుపెడతారు!

  • Wow... is eating too many dry fruits really that dangerous?

    Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

  • Boys should not eat these foods—if they do, they're in for serious trouble!

    Men Food: అబ్బాయిలు ఈ ఆహార పదార్థాలు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు!

  • Do you have a short temper? Stay away from these things completely...!

    Anger Management: మీకు కోపం ఎక్కువ? వీటి జోలికి అస్సలు వెళ్లకండి…!

Latest News

  • YOGA : ఆర్టీసీ హౌస్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

  • Rains : వారం రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

  • Jnaneswari: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఎన్నో కొత్త మలుపు.?

  • Wedding : జర్మనీలో మొదలైన ప్రేమ.. పల్నాడులో పెళ్లి పీటలు

  • Happy Fathers Day: నాన్నకు ప్రేమతో…

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd