HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >People With Diabetes Should Eat Only These Fruits

Diabetes Patients : మధుమేహం ఉన్నవారు ఈ పండ్లు మాత్రమే తినాలి..!

పండ్లు (Fruits) ఆరోగ్యానికి ఎంతో మేలు.. కానీ పండ్లలో ఫ్రక్టోస్ అనే తీపి పదార్థం ఉంటుంది.

  • Author : Maheswara Rao Nadella Date : 09-01-2023 - 4:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Diabetes Patients
Diabetes Patients

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు.. కానీ పండ్లలో ఫ్రక్టోస్ అనే తీపి పదార్థం ఉంటుంది. దీంతో రక్తంలో షుగర్ పెరిగిపోతుందేమోనన్న భయం వారిని వేధిస్తుంటుంది. నిజానికి రోజువారీ పండ్లు తీసుకుంటే మధుమేహం (Diabetes) రిస్క్ తగ్గుతుందని ఎన్నో అధ్యయనాలు అన్ని రకాల పండ్లు తినేస్తానంటే కుదరదు. ఎందుకంటే కొన్ని పండ్లలో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే తిన్న వెంటనే వేగంగా జీర్ణమై, రక్తంలోకి చక్కెరలు వేగంగా విడుదల అవుతుంటాయి. అందుకని గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న పండ్లను మధుమేహులు తినాల్సి ఉంటుంది. జీఐ తక్కువగా ఉన్న పండ్లు నిదానంగా జీర్ణమవుతూ, రక్తంలోకి క్రమంగా చక్కెరలు విడుదల చేస్తాయి. గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న పండ్లను తినొచ్చు కానీ, పరిమితంగానే తినాలి.

ముఖ్యంగా మధుమేహులు 150-200 గ్రాముల వరకు పండ్లను తినొచ్చు. ఒకవేళ షుగర్ అధికంగా ఉంటే కనుక పండ్ల పరిమాణం 100-150 గ్రాములకు తగ్గించుకోవాలి. గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న పండ్లను కూడా తినొచ్చు. కానీ, వాటి పరిమాణం 100 గ్రాములు మించకూడదు. ఇక మధుమేహంతో బాధపడేవారు బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ తో కలిపి పండ్లు తినకూడదు. ఎందుకంటే టిఫిన్, భోజంతో కార్బోహైడ్రేట్లు అధికంగా మన రక్తంలోకి చేరతాయి.

మధుమేహంతో (Diabetes) ఉన్నవారు యాపిల్, జామపండు, కమలా/నారింజ, బొప్పాయి, వాటర్ మెలాన్ తీసుకోవచ్చు. ఇవి చాలా మంచివి. వీటిల్లో ఫ్యాట్, క్యాలరీలు, సోడియం చాలా తక్కువ. పైగా వీటిల్లో విటమిన్ సీ, పొటాషియం, పీచు లభిస్తాయి. పొటాషియం రక్తపోటుని నియంత్రిస్తుంది. కణజాల నిర్మాణానికి, మరమ్మతులకు విటమిన్ సీ కావాలి. పళ్ల చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలన్నా విటమిన్ సీ అవసరం. బీ విటమిన్లు యాపిల్, మెలాన్ పండ్లు, బొప్పాయిలో లభిస్తాయి. పండ్ల రసం కంటే మొత్తం పండుగా తినాలి. దీనివల్ల పీచు లభించి జీర్ణ ప్రక్రియకు సాయపడుతుంది మధుమేహం (Diabetes) ఉన్న వారు సపోటా, మామిడి పండు, అరటి పండు, ద్రాక్ష పండ్లు, ఎట్టి పరిస్థితుల్లోనూ తినొద్దు. పనస తొనలు చాలా తక్కువగా తినాలి.

Also Read:  First Robot Lawyer : ప్రపంచంలోనే తొలి రోబో లాయర్..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • Diabetes
  • food
  • fruits
  • health
  • Life Style
  • Patients

Related News

Delicious Dishes

గ్యాస్‌తో పని లేకుండా ఫుడ్ త‌యారుచేసుకోండిలా!

గ్యాస్‌తో పని లేకుండా తక్కువ ఖర్చుతో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గ్యాస్ వాడకుండా తయారు చేయగల 3 ప్రత్యేక వంటకాలు ఏంటో చూద్దాం..!

  • Diabetes drug metformin works in the brain

    Metformin: మెట్‌ఫార్మిన్ గురించి షాకింగ్ నిజాలు

Latest News

  • శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు గాయం.. సీఎస్కేతో మ్యాచ్‌కు దూరం?!

  • Renuka Chowdhury: ఇది రాజధాని రైతుల విజయం.రేణుకా చౌదరి

  • Cm Chandrababu Naidu: తల్లికి వందనంపై కీలక ప్రకటన

  • Kerala Assembly Election 2026 : యూడీఎఫ్ మేనిఫెస్టో విడుదల చేసిన తెలంగాణ సీఎం రేవంత్

  • AP Elections : 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల పట్ల సంచలన ఆరోపణలు చేసిన పరకాల

Trending News

    • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

    • అల‌ర్ట్‌.. నేటి నుంచి కీల‌క మార్పులు!

    • శ్రేయస్ అయ్యర్‌పై బీసీసీఐ జరిమానా.. గ‌తేడాది కూడా ఇదే త‌ప్పు!

    • Pemmasani Chandrasekhar: 29 వేల మంది రైతులకు జరిగిన అన్యాయం ఇది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

    • Capital Amaravati: ఏపీకి గుడ్ న్యూస్.. లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం.

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd