Egg Consumption: గుడ్డు గుండెకు.. గుడ్డా? బ్యాడా..?
గుడ్డు (Egg )వినియోగం గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా..? గుడ్లు ఎక్కువగా తినడం వల్ల గుండెకు మేలు జరుగుతుందా..? ఈ సందేహాలకు నిపుణుల సమాధానాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం..!
- By Gopichand Published Date - 02:22 PM, Thu - 9 February 23

గుడ్డు (Egg )వినియోగం గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా..? గుడ్లు ఎక్కువగా తినడం వల్ల గుండెకు మేలు జరుగుతుందా..? ఈ సందేహాలకు నిపుణుల సమాధానాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం..!
గుడ్లు ఉడకబెట్టి తినడం వల్ల అందులోని ఇతర పోషకాలు, ప్రోటీన్స్ పూర్తిగా శరీరానికి అందుతాయి. ఒక వ్యక్తి అతడి ప్రతి కిలోగ్రాము బరువుకు రోజుకు 0.8 గ్రాముల నుంచి 1 గ్రాముల ప్రోటీన్ ఫుడ్ ను తినడం అవసరం అని అంటారు.దీని అర్థం.. మీరు ఒకవేళ 60 కిలోల బరువు ఉంటే మీకు రోజుకు 40-60 గ్రా ప్రోటీన్ అవసరం.
2,300 మందిపై స్టడీ
అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల జరిపిన రీసెర్చ్ లో ఆశాజనకంగా ఫలితం వచ్చింది.
గుడ్లు ఎక్కువగా తినడం వల్ల గుండెకు మేలు జరుగుతుందని తేలింది. ఈ రీసెర్చ్ లో భాగంగా 2,300 మందికి పైగా పెద్దలకు సంబంధించిన ఆహారపు అలవాట్ల డేటాను సేకరించి విశ్లేషించారు. వారానికి ఐదు లేదా అంతకంటే ఎక్కువ గుడ్లు తినడం వల్ల రక్తపోటు.. బ్లడ్ షుగర్.. టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని నిర్ధారించారు. గుడ్లు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు అవుతుందని తేల్చారు. ఈ స్టడీ రిపోర్ట్ జర్నల్ న్యూట్రియంట్స్ లో పబ్లిష్ అయింది.
రోజుకు ఒక గుడ్డు లేదా రెండు తెల్లసొనలు
ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా రోజుకు ఒక గుడ్డు లేదా రెండు గుడ్ల తెల్లసొనలను తినాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేస్తోంది. గుడ్లు ప్రోటీన్, ఇతర పోషకాలకు గొప్ప మూలం. అయితే అవి మన బాడీలో కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా పెంచుతాయి. ఈవిషయం ఒక్కటి గుండెకు మంచిది కాదు. ఒక గుడ్డు దాదాపు ఆరు గ్రాముల ప్రొటీన్‌ను మన బాడీకి ఇస్తుంది. వారానికి 2-3 గుడ్డు సొనలు తినొచ్చని గుర్తుంచుకోండి. ఫ్రూట్ జ్యూస్ , గోధుమ రొట్టెలు, గుడ్డు తో పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్ ను ప్లాన్ చేసుకోవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు.
■ గుడ్డులోని ప్రోటీన్ తో ఎన్నో బెనెఫిట్స్
★ గుడ్లలో ఉండే ప్రోటీన్లు రక్తపోటును తగ్గించే లక్షణాలను కలిగి ఉంటాయన్నారు. ఇవి సహజమైన శక్తివంతమైన ACE నిరోధకాలుగా పనిచేస్తాయని తెలిపారు.
★ ACE అంటే.. యాంజియో టెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్. ఇవి ఒక రకానికి చెందిన ఇన్ హైబిటర్లు. ఇవి మీ రక్త నాళాలను సడలించి..రక్తపోటును తగ్గించి..మీ రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. ★ గుడ్డులోని ప్రోటీన్స్ మీ జీర్ణక్రియ వేగాన్ని తగ్గించడమే కాకుండా, గ్లూకోజ్ శోషణను స్లో చేస్తుంది.మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
★ రోజుకు ఒక గుడ్డు తినడం వల్ల .. భోజనానికి ముందు (పరి కడుపున) రక్తంలో చక్కెర (బ్లడ్ షుగర్) మోతాదు గణనీయంగా 4.4 శాతం దాకా తగ్గుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.
■ గుడ్డులోని పోషకాలు ఇవీ
★ విటమిన్ ఎ – 6 శాతం
★ విటమిన్ బి – 5 నుంచి 7 శాతం
★ విటమిన్ బి – 12 నుంచి 9 శాతం
★ భాస్వరం – 9 శాతం
★ విటమిన్ బి2 – 15 శాతం
★ సెలీనియం – 22 శాతం