Nails Changing Color : మీ గోళ్ల రంగు మారుతోందా..? అయితే మీకు ప్రమాదం పొంచి ఉన్నట్లే..!!
Nails Changing Color : గోళ్లపై తెల్లటి మచ్చలు కనిపిస్తే, శరీరంలో ప్రోటీన్ లోపం లేదా కాలేయం బలహీనతకు సంకేతం కావచ్చు. అలాగే గోళ్లు పసుపు రంగులోకి మారితే బిలిరుబిన్ పేరుకుపోయినట్లుగా
- Author : Sudheer
Date : 05-06-2025 - 6:45 IST
Published By : Hashtagu Telugu Desk
మన శరీరంలో చిన్న మార్పులే పెద్ద వ్యాధులకు సంకేతాలు కావచ్చు. ముఖ్యంగా గోళ్ల రంగులో, ఆకారంలో జరిగే మార్పులు కొన్ని ప్రాథమిక ఆరోగ్య సమస్యలను ముందుగానే హెచ్చరిస్తాయి. వాటిలో ముఖ్యమైనవి కాలేయ సంబంధిత వ్యాధులు. కాలేయం (liver) శరీరంలో డిటాక్సిఫికేషన్, పాచక ప్రక్రియ నియంత్రణ, మెటబాలిజం వంటి కీలక పనులు చేస్తుంది. ఇది సరిగ్గా పనిచేయకపోతే, ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలు పడతాయి. గోళ్లపై తెల్ల మచ్చలు, పసుపు రంగు మార్పులు మొదలైనవి కాలేయ సమస్యలకు సంకేతాలు కావచ్చు.
Virat Kohli: కోహ్లీ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. విరాట్‌ను చూడాలంటే ఆగస్టు వరకు ఆగాల్సిందే!
ఉదాహరణకు గోళ్లపై తెల్లటి మచ్చలు కనిపిస్తే, శరీరంలో ప్రోటీన్ లోపం లేదా కాలేయం బలహీనతకు సంకేతం కావచ్చు. అలాగే గోళ్లు పసుపు రంగులోకి మారితే బిలిరుబిన్ పేరుకుపోయినట్లుగా, ఇది కామెర్లు లేదా హెపటైటిస్ వంటి రుగ్మతల సూచనగా చెప్పొచ్చు. టెర్రీ నెయిల్స్, గోళ్ల వాచినట్టుగా మారడం (Clubbing), లేదా గోళ్లు బలహీనంగా మారటం వంటి లక్షణాలూ సిర్రోసిస్ వంటి తీవ్రమైన కాలేయ వ్యాధులకు సూచకాలు.
ఈ లక్షణాలన్నీ కనిపిస్తే అది గోళ్ల అందాన్ని నశింపజేయడమే కాదు , ఆరోగ్యానికి హెచ్చరిక కావచ్చు. కాబట్టి ఇలాంటి మార్పులను లైట్‌గా తీసుకోవద్దు. సరైన సమయానికి వైద్య పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకుంటే కాలేయం సంబంధిత వ్యాధులను ప్రారంభ దశలోనే అదుపులోకి తేవచ్చు.