HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Morning Routine Habits To Help You Keep Your Blood Pressure

Blood Pressure: మీ బీపీ కంట్రోల్ లో ఉండాలంటే ఉదయం ఈ పనులు చేయాల్సిందే!

బీపీ అదుపులో ఉండాలి అంటే ఉదయం సమయంలో కొన్ని రకాల పనులు చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

  • Author : Anshu Date : 27-11-2024 - 2:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Blood Pressure
Blood Pressure

ప్రస్తుత రోజుల్లో చాలామంది అధిగ రక్తపోటు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అనికూడా అంటారు. ఎందుకంటే ఇది ఎలాంటి లక్షణాలను చూపించకుండా మనిషి ప్రాణాలను ఇట్టే తీసేయగలదు. అయితే ఈ రక్తపోటు అనేది అనేక కారణాల వల్ల పెరుగుతూ ఉంటుంది. మధ్యం అతిగా సేవించడం, మానసిక ఒత్తిడి, ఉప్పును ఎక్కువగా తీసుకోవడం, స్మోకింగ్ చేయడం వంటి కారణాల వల్ల రక్తపోటు బాగా పెరుగుతుంది.

ఈ రక్తపోటు కారణంగా గుండెపోటు, స్ట్రోక్, మూత్ర పిండాల వైఫల్యం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే ఉదయం కొన్ని పనులను చేస్తే రక్తపోటు కంట్రోల్ లో ఉంటుందట.. మరి అందుకోసమే ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. ప్రతిరోజు ఉదయం పూట కరెక్ట్ సమయానికి నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. ఇది మీ రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది మీ ఒత్తిడి, యాంగ్జైటీని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. అదేవిదంగా ఉదయం లేవగానే ఒక గ్లాసు నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి.

ఇది మీ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుందని, ముఖ్యంగా ఇది రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే అధిక రక్తపోటును నియంత్రించడానికి వ్యాయామం కూడా ఎంతో సహాయపడుతుందట. అందుకే ప్రతిరోజూ ఉదయం కనీసం ముప్పై నిమిషాలైనా వ్యాయామం చేయాలని చెబుతున్నారు. యోగా చేయడం వల్ల కూడా రక్తపోటు నియంత్రణలో ఉంటుందట. రక్తపోటును నియంత్రించడానికి మీ ఆహారంలో తప్పకుండా మార్పులు చేసుకోవాలట . ఇందుకోసం మీరు చేయాల్సిన మొదటి పని ఉప్పును తగ్గించడం.

సాధ్యమైనంత వరకు ఉప్పు ఎక్కువగా ఉండే ప్యాకేజ్డ్ ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలను తినడం తగ్గించాలని చెబుతున్నారు. ఇది రక్తపోటును తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. రక్తపోటును నియంత్రించడానికి మీరు ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలట. అందుకే మీరు ఉదయాన్నే పండ్లు, కూరగాయలు, మాంసకృత్తులు ఎక్కువగా ఉండే ఆహారాలను పుష్కలంగా తినాలని చెబుతున్నారు. ఉదయం లేవగానే కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ ఇది అస్సలు మంచిది కాదు. కెఫిన్ మీ రక్తపోటును పెంచుతుంది. అందుకే దీన్ని తాగకుండా మీ రక్తపోటు అదుపులో ఉంటుందట. అలాగే స్మోకింగ్ చేయడం మద్యం సేవించడం వంటివి కూడా అధిక రక్తపోటును పెంచుతాయని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • blood pressure
  • BP
  • health tips
  • morning

Related News

High Blood Pressure,

ఉదయం నిద్రలేవగానే ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ బీపీ పెరిగినట్లే!

అకస్మాత్తుగా తల తిరగడం లేదా బ్యాలెన్స్ తప్పడం హై బీపీని సూచిస్తుంది. ముఖ్యంగా ఉదయం పూట ఇలా అనిపిస్తే పరీక్ష చేయించుకోవడం అవసరం.

  • Weight Loss Tips

    రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

  • Heart Attack Anger

    కేవలం 8 నిమిషాల కోపంతో గుండెపోటు

Latest News

  • ఇంకా ఎంతకాలం జీవించి ఉంటానో తెలియదు .. మరణం పై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

  • అమెరికా ఈశాన్యాన్ని వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’.. స్తంభించిన జనజీవనం .. వేల విమానాల రద్దు ..!

  • వారికి ప్రత్యేక వెయిటేజ్ : కొత్త విధానానికి సీఎం చంద్రబాబు శ్రీకారం

  • తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

  • వెస్టిండీస్ మ్యాచ్‌ల ముందు జాతీయ గీతం ఎందుకు ప్లే చేయరు? అసలు కారణం ఇదే!

Trending News

    • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd