Sleep: రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోయే అలవాటు ఉందా.. మీరు డేంజర్ లో ఉన్నట్టే!
రాత్రి సమయంలో ఆలస్యంగా నిద్రపోవడం అంత మంచిది కాదని, ఇది ఎన్నో రకాల సమస్యలను తెచ్చిపెడుతుందని చెబుతున్నారు.
- By Anshu Published Date - 02:00 PM, Tue - 4 February 25

ప్రస్తుత రోజుల్లో చాలామంది రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోతున్న విషయం తెలిసిందే. ఇందుకు అనేక రకాల కారణాలు ఉన్నాయి. చాలామంది రాత్రి సమయంలో గంటల తరబడి మిడ్నైట్ వరకు ఫోన్లు చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా యువత బయట తిరుగుళ్ళు ఎక్కువగా తిరుగుతూ ఆలస్యంగా నిద్రపోయి పొద్దున ఎప్పుడో 10 గంటలకు అలా లేస్తూ ఉంటారు. ముఖ్యంగా సిటీ వాతావరణం లో ఈ కల్చర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ అలవాటు అప్పటికి మంచిదే అనిపించినప్పటికీ పోను పోను ఇది అనేక సమస్యలను తెచ్చిపెడుతుందని చెబుతున్నారు. మనిషికి నిద్ర అన్నది తక్కువ అయితే ఎన్నో రకాల సమస్యలను తెచ్చిపెడుతుందట.
మరి రాత్రి సమయంలో తక్కువగా నిద్రపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రాత్రి వేళ ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఒక వ్యక్తి ఎలాంటి మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కొక తప్పదని చెబుతున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందట. రోగనిరోధక శక్తి సమస్య కూడా పెరుగుతుందట. దీని కారణంగా మీరు అనేక రకాల ఇన్ఫెక్షన్లను కూడా పొందే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనితో పాటు, రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత కూడా ఏర్పడుతుందట. మధుమేహం, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. నిద్ర లేకపోవడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుందట.
జ్ఞాపకశక్తి ఏకాగ్రత తగ్గుతుందట. డిప్రెషన్ ఆందోళన ఒత్తిడి వంటి సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. చిన్న చిన్న వాటికే కోపం చిరాకు పెరుగుతుందట. ముఖ్యంగా కళ్ళ కింద నల్లటి వలయాలు మొహం పై ముడతలు కనిపిస్తాయని చెబుతున్నారు. మరి రోజులో ఎంతసేపు నిద్రపోవాలి అన్న విషయానికి వస్తే.. మనిషి ఈ సగటున ఏడు నుంచి 8 గంటల పాటు అయినా తప్పనిసరిగా నిద్రపోవాలని చెబుతున్నారు. అప్పుడే ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఎలాంటి సమస్యలు కూడా దరి చేరేవని చెబుతున్నారు. రాత్రిళ్ళు ఒంటి గంట తర్వాత పడుకునే ఉదయం 10 గంటలకు లేచిన కూడా అది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని చెబుతున్నారు.