Sleep & Obesity : సరిగ్గా నిద్రపోవడం లేదా అయితే ఒబేసిటీ రావడం ఖాయం..!!
కంటినిండా నిద్ర...బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కంటినిండా నిద్ర ఉంటేనే...ఎలాంటి సమస్యలు రావు.
- By hashtagu Published Date - 09:30 AM, Tue - 30 August 22
కంటినిండా నిద్ర…బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కంటినిండా నిద్ర ఉంటేనే…ఎలాంటి సమస్యలు రావు. అధిక బరువు నుంచి బయటపడతారు. అసలు నిద్రకు బరువుకు సంబంధం ఏంటి. తెలుసుకుందాం. నిద్ర, అధికబరువు లేదా ఊబకాయం మధ్యగత సంబంధాన్ని తెలుసుకునేందుకు స్పెయిన్ లో ఓ పరిశోధన జరిగింది.
స్పానిష్ నేషనల్ సెంటర్ ఫర్ కార్డియోవాస్కులర్ రీసెర్చ్ లోని కార్డియోవాస్కులర్ హెల్త్ అండ్ ఇమేజింగ్ లాబొరేటరిలో ఉన్న నిపుణులు జీసస్ మార్డినెజ్ గోమెజ్ ఈ పరిశోధనకు నేత్రుత్వం వహించారు. ఈ పరిశోధనలో దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా చాలా మంది యువకులు సరైన సమయానికి నిద్రపోకపోవడం, కంటినిండా నిద్రలేకుపోవడం వల్ల అధిక బరువు పెరుగుతున్నారని వెల్లడైంది. ఇలా నిద్రలేమి కారణంగా వచ్చే బరువుతో భవిష్యత్తులో ఎన్నో సమస్యలతోపాటు వ్యాధులను కూడా మొదలవుతాయని తెలిపారు.
అంతేకాదు ఈ సమస్య చిన్నపిల్లలోనూ ఉందని వివరించారు. స్మార్ట్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్న పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని పేర్కొన్నారు. పిల్లలతోపాటు టీనేజర్లు కూడా తక్కువ నిద్రపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారని తేలింది.
ఈ అధ్యయనం 1229మంది కౌమారదశలో ఉన్నవారిలో నిద్ర, ఆరోగ్యం మధ్య సంబంధాన్ని పరిశీలించింది. 1214 మంది 16 ఏళ్ల వయస్సున్న పిల్లలున్నారు. ఇందులో బాలురు, బాలికలు సమానంగా ఉన్నారు. వారిపై వారం రోజుల పాటు నిద్రను ట్రాక్ చేశారు. అమెరికన్ అకాడమీ ప్రకారం 6 నుంచి 12 ఏళ్ల వయస్సున్న పిల్లలు 9 నుంచి 12 గంటల వరకు నిద్రించాలి. 13 నుంచి 18 ఏళ్ల పిల్లలు ఖచ్చితంగా 8 నుంచి 10 గంటలపాటు నిద్రపోవాలి.
బాడీమాస్ ఇండెక్స్ ప్రకారం అధికబరువు, ఊబకాయం నిర్ణయించబడుతాయి. 12ఏండ్ల వయస్సులో 34శాతం మంది రోజులో 8గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. అదే సమయంలో 14ఏళ్లలోపు వారు 23శాతం, 16ఏళ్లలోపు వారు 19 శాతం పూర్తిగా నిద్రపోతున్నారని తేలింది. ఇక అమ్మాయిలతో పోల్చితే అబ్బాయిలు తక్కువగా నిద్రపోతారట.
Related News
Obesity: పిల్లల్లో ఊబకాయం పెరగడానికి అసలు కారణమిదే.. అవేంటో తెలుసా
Obesity: ఏ వయసులోనైనా స్థూలకాయం ప్రమాదకరం. ఇది అనేక దీర్ఘకాలిక వ్యాధులకు కూడా కారణం. స్థూలకాయం పెరగడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు, జీవక్రియ రుగ్మతలు మాత్రమే కాకుండా క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని చాలా అధ్యయనాలు కనుగొన్నాయి. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారిలో, ఊబకాయం పెరగడం గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ రోజుల్లో పిల్లల్లో ఊబకాయం చాలా వేగంగా పెరుగుతోందని, ఇది వారి �