Weight Loss: తొందరగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే రాత్రి పడుకునే ముందు ఇలా చేయండి?
ప్రస్తుత రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు అన్నది ప్రధాన సమస్యగా
- By Anshu Published Date - 07:00 AM, Sat - 19 November 22

ప్రస్తుత రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. అయితే ఈ అధిక బరువు సమస్య నుంచి బయటపడటానికి ఎన్నో రకాల చిట్కాలు పాటించినప్పటికీ కొంతమంది బరువు తగ్గరు. ఇంకొంతమంది అయితే బరువు తగ్గడం కోసం వ్యాయామాలు జిమ్ములకు వెళ్లడం అదేవిధంగా ఫుడ్ సరిగా తినకపోవడం ఇలాంటి ఎన్నో చిట్కాలను పాటిస్తూ ఉంటారు. అయినప్పటికీ రిజల్ట్ కనిపించకపోయేసరికి చాలామంది నిరాశ పడుతూ ఉంటారు. అయితే బరువు తగ్గాలి అనుకున్న వారు రాత్రి పడుకునే సమయంలో కొన్ని రకాల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మీరు తొందరగా బరువు తగ్గవచ్చు. రాత్రి సమయంలో ఎటువంటి పనులు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
రాత్రి సమయంలో ఒక గంట సేపు ఎక్కువగా నిద్ర పోవాలి. అంటే మనం పడుకునే సమయానికంటే గంటసేపు అదనంగా పడుకోవాలి. నిద్ర బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. కాగా మనకు ఏదైనా వ్యాధి సోకినప్పుడు ఎక్కువగా నిద్రపోవడం వల్ల సగం కంటే ఎక్కువ వ్యాధి ఆ నిద్రలోనే పోతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎక్కువగా నిద్ర పోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. అలాగే రాత్రి సమయంలో ప్రోటీన్ షేక్ తాగడం వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ ప్రోటీన్ షేక్ లో ఉండే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, కొవ్వు కంటే ఎక్కువ ధర్మోజెనిక్ ఉంటుందని నమ్ముతారు.
ఇది శరీరం జీర్ణం చేసుకోవడానికి ఎక్కువ కేలరీలను బర్న్ చేసి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అలాగే రాత్రి సమయంలో స్లీప్ మాస్క్ ధరించి పడుకోవాలి. స్లీప్ మాస్క్ ధరించి పడుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు. అయితే మసక వెళితుల్లో పడుకునే వారికి ఊబకాయం వచ్చే అవకాశాలు 21% ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లైట్ వెలుతురులో పడుకునే వ్యక్తులు స్లీప్ మాస్క్ ధరించి నిద్రపోవడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు.