Jamun Leaves: నేరేడు ఆకుల వల్ల కలిగే రహస్యం గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?
వేసవికాలం , గాలికాలం సమయంలో దొరికే పండ్లలో నేరేడు పండు కూడా ఒకటి. ఈ నేరేడు పండ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ
- By Nakshatra Published Date - 11:48 AM, Thu - 8 February 24
వేసవికాలం , గాలికాలం సమయంలో దొరికే పండ్లలో నేరేడు పండు కూడా ఒకటి. ఈ నేరేడు పండ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవి కేవలం సీజన్ లలో మాత్రమే లభిస్తూ ఉంటాయి. అందుకే సీజన్ వచ్చినప్పుడు వీటిని తినాలని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. కేవలం నేరేడు పండ్లు వల్ల మాత్రమే కాకుండా నేరేడు ఆకుల వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కొన్ని వ్యాధులను నియంత్రించే శక్తి నేరేడు ఆకుల్లో ఉంది. మరి నేరేడు ఆకుల వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటి అన్న విషయానికి వస్తే..
సాధారణంగా నేరేడు చెట్లు మన తెలుగు రాష్ట్రాలలోనే కాక మన ఇండియాలో రోడ్లకు ఇరువైపులా పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తాయి. ముఖ్యంగా పల్లెటూర్లలో బాగా కనిపిస్తాయి. నేరేడు చెట్టు చాలా వేగంగా పెరిగే గుణాన్ని కలిగి ఉంటాయి. నేరుడు ఆకుల రసంతో అండాశయం లేదా ఎండోమెట్రియం ఫంక్షనల్ డిజార్డర్ కారణంగా సంతాన ఉత్పత్తి కలగకపోతే నేరేడు లేత ఆకుల నుండి రసం తీయాలి. ఈ రసాన్ని రెండు స్పూన్లకు అర స్పూన్ తేనె కలిపి చేసుకుంటుంటే ఆ సమస్య పోయి సంతానం కలుగుతుంది. ఈ రోజుల్లో షుగర్ వ్యాధి బాగా విస్తరిస్తోంది. ఈ షుగర్ వ్యాధికి నేరేడు ఆకులు దివ్య ఔషధంలా పనిచేస్తాయి. లేత నేరేడు ఆకులు రెండు లేదా మూడు ఆకులు శుభ్రంగా కడిగి రెండు వారాలు తింటే షుగర్ వ్యాధి కంట్రోల్ అవుతుంది.
నాడి కణాలకు నరాలకు బలాన్ని కలిగిస్తోంది. ప్రతి అవయవానికి ఉత్తేజంగా చేస్తుంది. కాబట్టి నేరేడుఆకుల కాషాయం మిరాకిల్ కాషాయం అని చెప్పవచ్చు. అలాగే ఈ నేరేడు ఆకుల కాషాయం తరచూ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఎటువంటి వ్యాధులు వైరస్ లు మనల్ని తాకవు. ఈ నేరేడు ఆకుల కషాయాన్ని ప్రస్తుతం తాగటం మానేశారు. మన పూర్వీకులు ఈ కషాయాన్ని బాగా తాగేవారు. ప్రస్తుతం ఇలాంటి కాషాయాలు తాగకుండా మానబట్టే అనేక వ్యాధులు మనల్ని వెంటాడుతున్నాయి. ఎప్పుడైనా ప్రకృతి మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనం తీసుకోవాలా లేదా అనేది మన ఇష్టం. తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. తీసుకోకపోతే అనారోగ్యానికి గురవుతారు. అలాగే ప్రకృతి నియమాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలి. ఈ నియమాలను ఉల్లంఘిస్తే ప్రకృతి కోపానికి గురవుతారు.
Related News
Benefits Of Kundru: దొండకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. దొండకాయలో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణ ప్రక్రియను సజావుగా అమలు చేయడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం మరియు అపానవాయువు వంటి సమస్యలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.