Jackfruit: డయాబెటిస్ ఉన్నవారు ఆ పండు తింటే కలిగే లాభాలు ఇవే?
ప్రస్తుత రోజులో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో డయాబెటిస్ సమస్య కూడా ఒకటి. ఈ డయాబెటిస్ కారణంగా చాలామంది ఎటువంటి
- By Anshu Published Date - 06:45 PM, Wed - 10 May 23

ప్రస్తుత రోజులో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో డయాబెటిస్ సమస్య కూడా ఒకటి. ఈ డయాబెటిస్ కారణంగా చాలామంది ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అన్న భయపడుతూ ఉంటారు. అటువంటి వాటిలో పనస పండు కూడా ఒకటి.. డయాబెటిస్ పేషెంట్లు పనసపండు తినడానికి ఆలోచిస్తూ సంకోచిస్తూ ఉంటారు. పనస పండు తీయగా ఉండడం వల్ల మరింత పెరుగుతాయేమో అని భయపడుతూ ఉంటారు. అయితే పనసపండు కేవలం రుచిని పెంచడం మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. పనసపండు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి
పనస పండు రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు మలబద్దకాన్ని కూడా తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పనన పండు గింజలను ఎండబెట్టి పొడిగా చేసుకుని తిన్నట్లయితే అజీర్తి సమస్యలు దూరమవుతాయి. పనసలోని విటమిన్ ఏ మెదడు నరాలను బలపరుస్తుంది. పచ్చి పనస కాయలో యాసిడ్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు రోజూ తీసుకునే కార్బోహైడ్రేట్స్ స్థానంలో పనస పండ్లను తీసుకోవచ్చు. ముఖ్యంగా రైస్‌కు బదులు పనస పండ్లను తిన్నట్లయితే చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. పనస పండు శరీరంలోని గ్లూకోస్, ఇన్సులిన్, గ్లెసెమిక్ స్థాయులను నియంత్రిస్తుంది.
ఫలితంగా రక్తంలోని చక్కెర నిల్వలు నియంత్రణలో ఉండి మధుమేహం రాకుండా ఉంటుంది. కాబట్టి మధుమేహ రోగులు ఈ పండు తిన్నా ఎలాంటి సమస్యల ఉండవు. పనసతో ప్రయోజనాలు. కాబట్టి పనస పండు తినడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయి అనుకోవడం వట్టి అపోహలు మాత్రమే. పనసలో ఉండే పొటాషియం మధుమేహాన్ని, గుండెపోటును నియంత్రిస్తుంది. ఈ పండులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు, విటమిన్ సి, పనసలో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తాయి. ఈ పండు ఆస్తమాను తొలగించి, ఎముకలకు బలాన్ని ఇస్తుంది.
వేసవిలో మనకు విరివిగా దొరికే పండ్లలో పనసపండు ఒకటి. ఇందులో విటమిన్- ఎ, సి, బి6 లతో పాటు థియామిన్, రిబోప్లానిన్, నియాసిన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్ మరియు పైబర్ ను సమృద్దిగా కలిగి ఉంది. మరి…. ఇన్ని పోషక విలువలున్న పనసపండు మన ఆరోగ్యానికి ఏ విదంగా సహాయపడుతుందో తెలుసుకుదాం.