Phone Tapping : మీడియా చానెల్స్ యాజమాన్యాల ఫోన్లు సైతం ట్యాపింగ్ – రాధాకిషన్ రావు
మొన్నటి వరకు రాజకీయ నేతల తాలూకా ఫోన్లు మాత్రమే ట్యాపింగ్ చేసారని అంత భావించారు..కానీ ప్రముఖ మీడియా చానెల్స్ యొక్క యాజమాన్యాల ఫోన్లు సైతం ట్యాపింగ్ జరిగినట్లు అప్రూవర్ గా మారిన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో తెలిపి షాక్ ఇచ్చాడు
- By Sudheer Published Date - 06:50 AM, Tue - 28 May 24

తెలంగాణ లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు లో రోజు రోజుకు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటి వరకు రాజకీయ నేతల తాలూకా ఫోన్లు మాత్రమే ట్యాపింగ్ చేసారని అంత భావించారు..కానీ ప్రముఖ మీడియా చానెల్స్ యొక్క యాజమాన్యాల ఫోన్లు సైతం ట్యాపింగ్ జరిగినట్లు అప్రూవర్ గా మారిన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో తెలిపి షాక్ ఇచ్చాడు.
We’re now on WhatsApp. Click to Join.
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో వివాదాలున్న శంబీపూర్ రాజుపై, కడియం శ్రీహరితో ఉన్న రాజయ్య విభేదాలపై నిఘా పెట్టామని , తాండూరు ఎమ్మెల్యేతో పట్నం మహేందర్‌రెడ్డి దంపతులకు ఉన్న విభేదాలపైనా ఓ కన్నేసి ఉంచినట్లు రాధాకిషన్ రావు చెప్పుకొచ్చారు. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపైనా నిఘా పెట్టామన్నారు. అప్పటి బీఎస్పీ నేత ప్రవీణ్‌కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు ఒప్పుకున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డి, సరిత తిరుపతయ్యపై నిఘా పెట్టామన్నారు. జువ్వాడి నర్సింగరావు, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణతోపాటు ఈటల రాజేందర్, బండి సంజయ్, ఎంపీ అరవింద్ ఫాలోవర్ల ఫోన్లపై నిఘా పెట్టినట్లు రాధాకిషన్ పేర్కొన్నాడు. కొందరు మీడియా యజమానుల వాట్సప్, స్నాప్‌చాట్‌లో మాట్లాడిన వారి వివరాలు సేకరించినట్లు తెలిపారు. ఇంటర్నెట్ ప్రొటోకాల్ డేటా రికార్డులను ప్రణీత్‌రావు విశ్లేషించారని రాధాకిషన్‌రావు అంగీకరించారు. రాధాకిషన్ తెలిపిన వివరాలతో అధికారులు , రాజకీయ ప్రముఖులంతా షాక్ లో పడ్డారు.
Read Also :Moles Health Problems : పుట్టుమచ్చల్లాంటి మచ్చలొస్తున్నాయా ? ఈ రోగాలు రావొచ్చు..