HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Health
  • ⁄India Is The Second Most Sleep Deprived Country What We Can Do To Fix Our Sleep Habits

Sleep Deprived: నిద్రలేమిలో వరల్డ్ నంబర్ 2 ఇండియా.. మీకూ ఈ ప్రాబ్లమ్ ఉంటే ఇలా అధిగమించండి..!

జపాన్ తర్వాత ప్రజలు అత్యధికంగా నిద్రలేమి (Sleep Deprived)తో బాధపడుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉందని తాజా నివేదికలు చెబుతున్నాయి. 7 గంటల కనీస నిద్ర మన శరీర ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది.

  • By Hashtag U Published Date - 07:15 AM, Sat - 18 March 23
Sleep Deprived: నిద్రలేమిలో వరల్డ్ నంబర్ 2 ఇండియా.. మీకూ ఈ ప్రాబ్లమ్ ఉంటే ఇలా అధిగమించండి..!

జపాన్ తర్వాత ప్రజలు అత్యధికంగా నిద్రలేమి (Sleep Deprived)తో బాధపడుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉందని తాజా నివేదికలు చెబుతున్నాయి. 7 గంటల కనీస నిద్ర మన శరీర ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. నిద్ర లేకపోవడం వల్ల కలిగే సమస్య ‘అలసట’ కంటే కాస్త ఎక్కువగానే ఉంటుందని మనం అర్థం చేసు కోవాలి. నిద్ర మన దైనందిన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది మన శ్రేయస్సుతో పరస్పరం అనుసంధానించబడి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలన్నా.. రోజంతా ఉత్పాదకంగా ఉండాలన్నా.. మనం రాత్రివేళ కంఫర్టబుల్ గా నిద్రపోవడం చాలా అవసరం.

అలసట, తలనొప్పి, మూడ్ స్వింగ్స్ అన్నీ మన మానసిక ఉల్లాసానికి తోడుగా ఉంటాయి. నేర్చుకోవడం, జ్ఞాపకశక్తి, భావోద్వేగ సమ తుల్యతకు సంబంధించిన మన సామర్థ్యాలు నిద్ర నాణ్యతపై ఆధారపడి ఉంటాయి.నిద్ర అనేది మన మెదడు డేటాను ప్రాసెస్ చేస్తుంది. మనం నిద్ర పోతున్నప్పుడు దీర్ఘకాలిక జ్ఞాపకాలను మెదడు ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల రోజూ తగినంత సమయం నిద్రపోవడం చాలా అవసరం.

■ మీకు నిద్ర పట్టడం లేదని తెలుసుకోవడం ఎలా?

మీ నిద్ర యొక్క సైకిల్ అనేది మీ రోగనిరోధక వ్యవస్థతో సన్ని హితంగా కమ్యూనికేట్ చేస్తుంది. మీరు నిద్రపోతున్నప్పుడు మీ రోగనిరోధక వ్యవస్థ సైటోకైన్లను విడుదల చేస్తుంది. మీ బాడీ ఇన్ఫెక్షన్ బారినపడితే పోరాడేవి ఈ సైటోకైన్లే అని గుర్తుంచుకోండి. మీకు తగినంత నిద్ర లేనప్పుడు.. శరీరంలో సైటోకైన్లు, ఇతర ఇన్ఫెక్షన్ పోరాట ప్రతిరోధకాలు తక్కువగా ఉత్పత్తి అవుతాయి. చిన్నచిన్న సమస్యలకు ఆందోళన చెందడం, నిరంతరం అలసిపోవడం, ఏకాగ్రత కోల్పోవడం వంటివి నిద్ర లేమికి సంకేతాలు.

◆ మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం?

నిద్ర లేమికి గల కొన్ని సాధారణ కారణాలలో.. పడుకునే ముందు ఎక్కువ సమయం పాటు స్మార్ట్ ఫోన్ చూడటం ముఖ్యమైనది.
నిద్ర మేల్కొనే టైం ను నిర్ధారించకపోవడం కూడా పెద్ద సమస్యే.

■గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్‌కార్డ్

★ వేక్‌ఫిట్ ద్వారా రూపొందించ బడిన ” గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్‌కార్డ్” భారతదేశ ప్రజల యొక్క నిద్ర ప్రవర్తనకు సంబంధించిన కీలకమైన అంశాలను గుర్తించింది.
★ దీని ప్రకారం.. 87% మంది భారతీయులు పడుకునే ముందు తమ ఫోన్‌లను ఉప యోగిస్తున్నారు. దీనివల్ల వారిలో తీవ్రమైన నిద్ర సమస్య ఏర్పడుతోంది.
★ పనిచేసే సమయంలో 67% మంది మహిళలకు నిద్రమబ్బు కమ్ముకుంటుండగా.. 56% మంది పురుషులకు స్లీపీ ఫీలింగ్ కలుగుతోంది.
★ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పని వేళల సందర్భంలో నిద్రపోతున్న వ్యక్తులలో 21% పెరుగుదల నమోదైంది.

■ నిద్ర లేమికి పరిష్కారం ఎలా?

★ మీ నిద్ర షెడ్యూల్‌ని సిద్ధం చేసుకొని, రోజూ దానికి కట్టుబడి ఉండండి. రోజూ మీరు నిర్దేశించుకున్న సమయానికి పడుకోవాలి, నిద్ర లేవాలి.
★ మధ్యాహ్నం 2:00 గంటల సమయం దరిదాపుల్లో కెఫీన్‌ ఉండే కాఫీ, ఫ్రూట్స్,ఫుడ్ ఐటమ్స్ తీసుకోవద్దు.కెఫీన్‌ మన బాడీలో దాదాపు 8 గంటలు యాక్టివ్ గా ఉంటుంది. మీరు ఒకవేళ మధ్యాహ్నం 2 గంటల దరిదాపుల్లో కెఫిన్ ఉన్న ఫుడ్స్, డ్రింక్స్ తీసుకుంటే రాత్రి నిద్రపోయే టైం లో ప్రాబ్లమ్ వస్తుంది. సమయానికి నిద్ర పట్టదు.
★ నిద్రపోయే 3 గంటలలోపు మద్యం తాగడం ఆపండి.
★ మీ నిద్రవేళకు చాలా దగ్గర టైంలో వ్యాయామం చేయకుండా జాగ్రత్త వహించండి. దీనివల్ల నిద్ర పట్టడం కష్టమవుతుంది.
★ ప్రతి ఉదయం 15 నిమిషాల సూర్యకాంతి పొందండి. ఇది మీ బాడీలోని సర్కాడియన్ గడియారాన్ని రీసెట్ చేయడంలో సహాయపడుతుంది. దీనివల్ల నాణ్యమైన నిద్ర లభిస్తుంది.

Telegram Channel

Tags  

  • Benefits of Sleeping
  • health tips
  • Sleep Deprived
  • Sleep Habits
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Health Tips: అధిక రక్తపోటు సమస్యకు అరటిపండుతో చెక్ పెట్టండిలా?

Health Tips: అధిక రక్తపోటు సమస్యకు అరటిపండుతో చెక్ పెట్టండిలా?

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో అధిక రక్తపోటు సమస్య కూడా ఒకటి. అధిక రక్తపోటు ,

  • Dental Doctor: ఇవి తీసుకుంటే డెంటల్ డాక్టర్ తో పని లేదు… అవి ఏవేంటే!

    Dental Doctor: ఇవి తీసుకుంటే డెంటల్ డాక్టర్ తో పని లేదు… అవి ఏవేంటే!

  • Progesterone Production: ప్రొజెస్టరాన్ ప్రొడక్షన్ పెంచే 5 ఫుడ్స్ ఇవే..!

    Progesterone Production: ప్రొజెస్టరాన్ ప్రొడక్షన్ పెంచే 5 ఫుడ్స్ ఇవే..!

  • Health Tips: కూల్ డ్రింక్స్, మాంసం ఎక్కువగా తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త?

    Health Tips: కూల్ డ్రింక్స్, మాంసం ఎక్కువగా తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త?

  • Health Tips: ఎక్కువసేపు కూర్చొని పనిచేస్తున్నారా.. అయితే జాగ్రత్త?

    Health Tips: ఎక్కువసేపు కూర్చొని పనిచేస్తున్నారా.. అయితే జాగ్రత్త?

Latest News

  • Chaitra Navratri Special: సాత్విక, రాజస, తామస ఆహారం మధ్య తేడా? ప్రయోజనాలు?

  • Shahid Afridi: టీమిండియాని పాకిస్తాన్‌కి పంపండి పీఎం సాబ్.. ప్రధానిని మోదీని కోరిన షాహిద్ అఫ్రిది..!

  • Liquor scam :ఈడీ ఆఫీస్ వ‌ద్ద 144 సెక్ష‌న్‌,క‌విత అరెస్ట్ త‌థ్యం?

  • Amitabh Health Update: మీ ప్రార్థనలు ఫలించాయి.. త్వరలోనే మీ ముందుకొస్తున్నా!

  • Amitabh Bachchan: గాయాల నుంచి కోలుకుంటున్నా.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన అమితాబ్..!

Trending

    • Umesh Chandra:వైఎస్ రాజారెడ్డికి సంకెళ్లు వేసిన గ్రేట్ ఐపీఎస్

    • MS Dhoni: ధోని గురించి ఎవరికీ తెలియని రహస్యం చెప్పిన రాబిన్ ఊతప్ప..!

    • Rohit Sharma: రోహిత్ శర్మ బ్యాటింగ్ లోనే కాదు.. డ్యాన్స్ లో కూడా ఆదరగొట్టాడు.. వీడియో వైరల్..!

    • RRR: నాటు నాటు పాటకు స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ.. అబ్బో మాములుగా చేయలేదుగా?

    • Sachin Tendulkar: ఆ రాత్రి అలా గడిపాను.. సచిన్ టెండూల్కర్ షాకింగ్ కామెంట్స్?

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: