Drumstick Water: ఉదయాన్నే పరగడుపున మునగకాయ నీరు తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
Drumstick Water: ఉదయాన్నే పరగడుపున మునగ నీరు తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 07:00 AM, Mon - 3 November 25
Drumstick Water: మునగ కాయల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మునగకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల అనేక వ్యాధుల నుంచి బయట పడవచ్చు. మునగకాయ లలో ప్రోటీన్, విటమిన్లు ఎ, సి, బి కాంప్లెక్స్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయట. మునగకాయ నీరు వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడటమే కాకుండా మీ మొత్తం ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని చెబుతున్నారు.
మునగ చెట్టు లోని ఆకు, బెరడు లేదా కాయ ఇలా అన్ని భాగాలు ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటాయట. మునగకాయ నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. అయితే మునగ నీరు వల్ల కలిగే లాభాల గురించి చాలా మందికి తెలియదు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మునగ కాయ వాటర్ శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుందట. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు శరీరానికి బ్యాక్టీరియా, వైరస్లతో పోరాడే శక్తిని ఇస్తాయట. దీన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల కాలానుగుణ వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించుకోవచ్చని చెబుతున్నారు.
మునగ కాయలు ఫైబర్, ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉంటాయట. ఇవి జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయని, దీని నీరు పేగు వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుందని మలబద్ధకాన్ని తగ్గిస్తుందని జీర్ణక్రియ నిర్వహించబడుతుందని కడుపు తేలికగా అనిపిస్తుందని చెబుతున్నారు. మునగ కాయ వాటర్ జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుందట. ఇది ఆకలిని నియంత్రిస్తుందని, అదనపు కొవ్వును కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తాగడం వల్ల బరువు తగ్గడం వేగవంతం అవుతుందట. మునగ కాయ వాటర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందట.
దీని లక్షణాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయని,డయాబెటిస్ ను నియంత్రించడంలో సహాయపడతాయని, ప్రతిరోజూ దీనిని తాగడం డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. మునగకాయ నీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెరిసే చర్మాన్ని, బలమైన జుట్టును ప్రోత్సహిస్తాయట. ఇది చర్మం నుండి విషాన్ని బయటకు పంపి జుట్టు మూలాలను పోషిస్తుందని చెబుతున్నారు. మునగకాయ నీటిని ఎలా తయారు చేయాలి? 3 నుంచి 4 తాజా మునగకాయలు, 2 నుంచి 3 గ్లాసుల నీటిని తీసుకోవాలి. ముందుగా మునగ కాయలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని నీటిలో వేసి 10 నుంచి 15 నిమిషాలు తక్కువ మంట మీద మరిగించాలి. నీటిని వడకట్టి తీసుకోవాలట. ఈ నీటిని ఉదయం ఖాళీ కడుపుతో లేదా పగటిపూట కూడా తాగవచ్చట.