Head Bath: రాత్రిళ్లు తల స్నానం చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?
ప్రస్తుత రోజుల్లో బిజీ బిజీ షెడ్యూల్ వల్ల చాలామంది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.
- By Anshu Published Date - 06:30 AM, Fri - 23 December 22

ప్రస్తుత రోజుల్లో బిజీ బిజీ షెడ్యూల్ వల్ల చాలామంది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా మనుషుల మధ్య బంధాలు కూడా దెబ్బతింటున్నాయి. మరి ముఖ్యంగా సిటీలో ఉన్నవారు చాలామంది భార్యాభర్తలు ఆఫీసులలో బిజీ అయిపోవడం వల్ల పొద్దున్న ఎప్పుడో వెళ్లి రాత్రి అనంగా ఇంటికి వస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే చాలామంది రాత్రి సమయంలో కొన్ని పనులను పూర్తి చేసుకోవడం వల్ల ఉదయాన్నే తొందరగా ఆఫీసుకు వెళ్లిపోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. వాటిల్లో తల స్నానం కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఉదయాన్నే ఆఫీస్ కి వెళ్లే ముందు తల స్నానం చేయడం ఎందుకు అనుకున్న కొంతమంది రాత్రి సమయంలోనే లేట్ అయినా పర్వాలేదు అనుకోని రాత్రి సమయంలో తలస్నానం చేస్తూ ఉంటారు.
అయితే రాత్రి సమయంలో తలస్నానం చేయడం వల్ల శాస్త్ర ప్రకారంగానే కాకుండా సైంటిఫిక్ పరంగా కూడా ఎన్నో సమస్యలు వస్తాయి. మరి రాత్రి సమయంలో తలస్నానం చేయడం వల్ల ఎటువంటి సమస్యలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే రాత్రి సమయాల్లో తలస్నానం చేసి పడుకొన్నప్పుడు తలగడ, బెడ్‌కు వెంట్రుకలు అంటుకుంటాయి. పొడి జుట్టుకంటే తడిగా ఉన్నప్పుడే ఎక్కువగా జట్టు ఊడిపోతుంది. రాత్రి సమయంలో తలస్నానం చేసి అలాగే జుట్టు ఆరకముందే పడుకోవడం వల్ల జుట్టు మరింత చిక్కబడుతుంది. దీంతో ఉదయం లేచినప్పుడు అలాగే రాత్రి పడుకునేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది.
తలస్నానం చేసిన వెంటనే చిక్కుతీయకుండా పడుకుంటే ఉదయానికల్లా ఉండచుట్టుకు పోతుంది. క్రమంగా హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవుతుంది. వెంట్రుకలు చిక్కుతీసే క్రమంలో ఎక్కువగా వెంట్రుకలు రాలిపోతు ఉంటాయి. పగలు సమయం కంటే రాత్రుళ్లు తలస్నానం చేస్తే జుట్టులో తేమ అలాగే ఉండిపోతుంది. దీంతో చుండ్రు, జుట్టు రాలడం, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు కూడా వస్తాయి. తడిజుట్టు తేమ కారణంగా ఫంగల్ పెరుగుతుంది. అంతేకాకుండా రాత్రి సమయాల్లో స్నానం చేసి అలాగే పడుకోవడం వల్ల జలుబు కూడా చేయవచ్చు.