ICE APPLE BENEFITS : సమ్మర్ లో కూల్ చేసే ఐస్ యాపిల్
సమ్మర్ సీజనల్ పండ్లలో తాటి ముంజలు(ఐస్ ఆపిల్) ఎవర్ గ్రీన్.. వీటిని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు(ICE APPLE BENEFITS) కలుగుతాయి. అందుకే వీటిని మిస్ కాకండి ..ఎన్నో పోషకాలను మీ శరీరానికి అందించండి.
- Author : Pasha
Date : 16-05-2023 - 2:36 IST
Published By : Hashtagu Telugu Desk
సమ్మర్ సీజనల్ పండ్లలో తాటి ముంజలు(ఐస్ ఆపిల్) ఎవర్ గ్రీన్.. వీటిని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు(ICE APPLE BENEFITS) కలుగుతాయి. అందుకే వీటిని మిస్ కాకండి ..ఎన్నో పోషకాలను మీ శరీరానికి అందించండి. తాటిముంజలలో విటమిన్ బి-7, విటమిన్-కె, కరిగే ఫైబర్, పొటాషియం, కాల్షియం, విటమిన్-ఎ, విటమిన్-సి, విటమిన్-డి, జింక్, ఐరన్ పుష్కలంగా(ICE APPLE BENEFITS) ఉంటాయి. వీటిలో నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల వడదెబ్బ తగలకుండా ప్రొటెక్షన్ లభిస్తుంది. ఇవి మన శరీరాన్ని చల్లబరుస్తాయి. ఫలితంగా డీహైడ్రేషన్ ముప్పు కూడా ఉండదు. కాలేయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. తాటి ముంజలు తినడం వల్ల అనవసరపు కేలరీలు బాడీలోకి చేరవు . గర్భిణులు తమ మెటబాలిజం రేట్ ను బాగా మెయిటైన్మె చేసుకోవడంలో ముంజలు ఉపయోగపడుతాయని వైద్యనిపుణులు అంటున్నారు. తాటిముంజల్లో ఉండే ఫైటో కెమికల్స్, ఆంతోసినిన్ శరీరంలో ట్యూమర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ ను పెరగకుండా నిరోధిస్తాయి. వీటిలో పుష్కలంగా ఉండే పొటాషియం వల్ల రక్తపోటు, గుండె ఆరోగ్యం నియంత్రణలో ఉంటుంది.
ఆరు అరటిపండ్లలో ఉండే పొటాషియం ఒక్క తాటిముంజలో..
ఆరు అరటిపండ్లలో ఉండే పొటాషియం ఒక్క తాటిముంజలో ఉంటుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎముకలను బలంగా ఉంచేందుకు వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు ముంజలు చాలా మంచివట. తాటి ముంజల్లో స్వచ్ఛమైన రుచికరమైన నీరు ఉంటుంది. వీటిని కన్నడలో ‘తాటి నుంగు’ అని.. తమిళంలో ‘నుంగు’ అని అంటారు. ప్రస్తుతం వీటి ధర డజను రూ. 70గా పలుకుతుంది. ఈ దశాబ్దంలో ఇవే అత్యధికం. గత ఏడాది డజను రూ. 40 నుంచి రూ. 50 వరకు అమ్ముడుపోయాయి. బాగా రద్దీగా ఉండే ప్రదేశాలలో ఒక చోట తాటి ముంజులను తీసుకువచ్చి ఉంచుతారు. కేవలం గంటలోనే ఆటో ఖాళీ అయిపోతుందంటే అతిశయోక్తి కాదేవెూ. ప్రభుత్వం ఇటీవల చెట్టుపై తీసుకునే ఛార్జీలను కూడా ఎత్తివేసింది. దీనివల్ల కార్మికులకు కొంత ఊరట లభించినట్లయింది. తాటి ముంజులే కాకుండా కల్లు, తాటి కాయలు కూడా ఈ చెట్ల నుంచే వస్తాయి.