Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ అధిక తింటే అంత ప్రమాదమా?
డ్రై ఫ్రూట్స్ తినడం మంచిదే కానీ అలా అని ఎక్కువగా తింటే మాత్రం సమస్యలు తప్పవు అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 02:03 PM, Sat - 23 November 24

డ్రై ఫ్రూట్స్.. ఇవి ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ వీటి ధర కారణంగా చాలామంది వీటిని కొనుగోలు అంటే భయపడుతూ ఉంటారు. అయితే డ్రై ఫ్రూట్స్ తినడం మంచిదే కానీ అలా అని మోతాదుకు మించి తింటే మాత్రం ఆరోగ్యం పక్కాగా పాడవుతుందని చెబుతున్నారు. మరి డ్రై ఫ్రూట్స్ ని మోతాదుకు మించి తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందులో మొదటగా పిస్తా విషయానికి వస్తే..
ఇందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ పిస్తాను ప్రతి రోజు 20 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదట. అలాగే జీడిపప్పు తినటం వల్ల పెద్ద ఆసియంలో రాళ్లు ఏర్పడకుండా నివారించవచ్చు. అలా అని వారానికి 28 జీడి పప్పులు కన్నా ఎక్కువ తినటం మంచిది కాదట. అలాగే ఎండు ద్రాక్షని ఎంత మోతాదులో తిన్నా పర్వాలేదట. ఇందులో విటమిన్ బి పొటాషియం ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి రోజుకి గుప్పెడు ఎండు ద్రాక్ష తినవచ్చట. అలాగే వాల్ నట్స్ రోజుకి మూడు నాలుగు మించి తీసుకోకూడదట. వాల్నట్స్ మీద ఉండే స్కిన్ ఫ్లేవర్ అంత టేస్టీగా ఉండదని చెబుతున్నారు.
కానీ 90 శాతం ఆంటీ ఆక్సిడెంట్సు ఫెనోలికే యాసిడ్స్ ఈ స్కిన్ లోనే ఎక్కువగా ఉంటాయి ఇవి గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షించడంలో చాలా ఎఫెక్ట్ గా పని చేస్తాయట. అలాగే బాదం గింజలు రోజుకి నాలుగు నుంచి ఏడు గింజల వరకు తినటం ఆరోగ్యానికి మంచిదని అంతకుమించి ఎక్కువగా తినకపోవడమే మంచిది అని చెబుతున్నారు. అలాగే ఖర్జూరం తినటానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ప్రాక్టోజ్ రిచ్ గా ఉంటుంది మెటబాలిజం స్థాయి చురుగ్గా ఉండడానికి ఖర్జూరం ఉపయోగపడుతుంది. అలాంటి ఈ ఖర్జూరాన్ని రోజుకి ఒకటి లేదా రెండు తీసుకుంటే సరిపోతుంది. అయితే నట్స్ ని నేరుగా కాకుండా నానబెట్టి తినటం వల్ల మరింత ప్రయోజనం ఉంటుందట.