Drinking Water : ప్రతి రోజు ఎంత వాటర్ తాగాలి..? తాగకపోతే ఏమవుతుందో తెలుసా..?
Drinking Water : వ్యర్థాలను బయటకు పంపించడంలో, శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో, జీర్ణక్రియ మెరుగుపరిచే విషయంలో, నీరు (Water) ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది
- By Sudheer Published Date - 06:55 AM, Mon - 21 April 25

వేసవిలో శరీరాన్ని చల్లబరచడానికి, శక్తివంతంగా ఉంచడానికి నీటి (Water) పాత్ర ఎంతో కీలకం. మన శరీరంలో సుమారు 75 శాతం వరకు నీరు ఉండటంతో, శరీరం సరిగ్గా పనిచేయాలంటే ప్రతి కణానికి సరిపడా నీరు అందాల్సిన అవసరం ఉంది. వ్యర్థాలను బయటకు పంపించడంలో, శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో, జీర్ణక్రియ మెరుగుపరిచే విషయంలో, నీరు (Water) ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. NIH చేసిన పరిశోధన ప్రకారం.. నీరు రక్తంలో ఆక్సిజన్ స్థాయిని మెరుగుపరచడంలో, ఒబేసిటీ తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి వేసవిలో మరింత జాగ్రత్తగా నీరు తాగడం చాలా అవసరం.
By Polls : అతి త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు – కేటీఆర్
శరీరానికి అవసరమైన నీటి పరిమాణం వ్యక్తుల జీవనశైలి, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మహిళలు రోజుకు 2.7 లీటర్లు, పురుషులు 3.7 లీటర్లు నీరు తాగాలని అమెరికా నేషనల్ అకాడమీస్ సూచిస్తోంది. దాహం వేసినప్పుడు, భోజనానికి ముందు, తర్వాత, వ్యాయామం చేసిన తర్వాత నీరు తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. తక్కువ నీరు (Water) తాగితే డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. దాంతో కండరాల పట్టేయడం, తలనొప్పి, మలబద్ధకం, వడదెబ్బ వంటి సమస్యలు ఏర్పడతాయి. చర్మం నిగారింపు కోల్పోయి, మూత్రపిండాల పనితీరు కూడా దెబ్బతింటుంది.
అయితే అవసరానికి మించి నీరు తాగినా ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఎక్కువ నీరు తాగడం వల్ల రక్తంలో సోడియం స్థాయి తగ్గి హైపోనట్రేమియా ఏర్పడే అవకాశముంటుంది. దీని వల్ల అలసట, తిమ్మిరి, వాంతులు లాంటి లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, వ్యాయామం ఎక్కువగా చేసే వారు శరీర అవసరాలను బట్టి నీరు తాగాలి. ఆరోగ్యంగా ఉండాలంటే శరీర సంకేతాలను గుర్తించి, సరైన సమయంలో సరిపడిన మొత్తంలో నీరు తీసుకోవడం ఎంతో అవసరం.