Eggs: సమ్మర్ లో ప్రతిరోజు ఎన్ని కోడిగుడ్లు తినాలో మీకు తెలుసా?
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కోడిగుడ్లు వేసవికాలంలో రోజుకు ఎన్ని తినాలి. అతిగా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 12:03 PM, Mon - 31 March 25

కోడిగుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు. అయితే కోడిగుడ్లు ఆరోగ్యానికి మంచిదే కానీ వేసవికాలంలో ప్రతిరోజు వీటిని తినవచ్చా? తింటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆరోగ్యంగా ఉండాలంటే ఎండాకాలంలో కూడా గుడ్లను ఖచ్చితంగా తినాలని చెబుతున్నారు. గుడ్లు మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందిస్తుందట.
ఎండాకాలంలో గుడ్లను తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, శరీరానికి హాని కలుగుతుందని చాలా మంది నమ్ముతారు. కానీ అవన్నీ కేవలం అపోహలు మాత్రమే అని ఎండాకాలంలో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా కోడిగుడ్లు తినవచ్చు అని చెబుతున్నారు. గుడ్లను తినడం వల్ల మన శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ డి వంటి ఎన్నో పోషకాలు అందుతాయట. అయితే ఎండాకాలంలో రోజుకు 1 నుంచి 2 గుడ్లను తినవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని ఉడకబెట్టి లేదా ఆమ్లేట్ వేసుకుని తినవచ్చని చెబుతున్నారు. సరైన మోతాదులో గుడ్లను తింటే మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందట.
అలాగే మన శరీరానికి సంబంధించిన సమస్యలతో పోరాడే శక్తి కూడా వస్తుందని చెబుతున్నారు. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే అంటు వ్యాధులతో పాటుగా ఇతర రోగాలు వచ్చే ప్రమాదం ఉందట. కాగా కోడి గుడ్లలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుందట. మీరు గుడ్లను సరైన మొత్తంలో తింటే మీ ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయట. గుడ్లు దంతాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయట. గుడ్లను తరచుగా తింటే ఎముకలకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని చెబుతున్నారు. ఎండా కాలంలో కళ్లపై ఒత్తిడి ఎక్కువగా పడుతుందట. దీంతో కళ్లు అలసటకు గురవుతాయట. అలాగే కంటికి సంబంధించిన సమస్యలు వస్తుంటాయని చెబుతున్నారు. అయితే ఎండా కాలంలో రోజూ 1 లేదా 2 గుడ్లను తినడం వల్ల కళ్లకు మేలు జరుగుతుందట. వీటిలో ఉండే గుణాలు కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయని చెబుతున్నారు. ఎండాకాలంలో గుడ్లను మరీ ఎక్కువగా తినకూడదట. ఎందుకంటే ఈ సీజన్ లో గుడ్లను ఎక్కువగా తింటే అజీర్ణం, చంచలత, పేగు వంటి ఎన్నో సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఎండాకాలంలో 1 లేదా 2 కంటే ఎక్కువ గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిది కాదట.