Body Pain Relief: వేసవిలో ఈ నొప్పులు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే!
వేసవికాలంలో వచ్చే కొన్ని రకాల నొప్పుల నుంచి ఉపశమనం పొందాలి అనుకుంటే కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 08:00 AM, Mon - 17 February 25

మామూలుగా వేసవికాలంలో దేశంలో ఎన్నో రకాల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. వీటి వల్ల అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటిలో ఒళ్ళు నొప్పులు సమస్యలు కూడా ఒకటి. చాలామందికి ఎక్కువగా శరీరం అవ్వడం వల్ల కూడా భుజాల నొప్పి ,మెడ నొప్పి, కాళ్ళ నొప్పి, కీళ్ళనొప్పి సాధారణంగా వస్తూ ఉంటాయి. అయితే వీటి కోసం బయట దొరికే టాబ్లెట్స్ వాడడం మంచిది కాదని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యం పై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంటుందట. కాబట్టి వీలైనంత వరకు ఎటువంటి వాటిని ఇంటి వద్ద సహజంగా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలని చెబుతున్నారు.
వయసులో పెద్దవారు ఈ నొప్పులు తట్టుకోలేక ఎక్కువగా టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. ఇలా ఎక్కువ మోతాదులో మెడిసిన్స్ తీసుకోవడం వల్ల తెలియకుండా గ్యాస్, మలబద్ధకం, కడుపునొప్పి ,అజీర్తి, తలనొప్పి లాంటి సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతాయట. ఇక మళ్లీ వాటి కోసం కొత్తగా మాత్రలు తీసుకునే పరిస్థితి వస్తుందట. మరి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వీటికి ఎలా చెక్ పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కూరల్లో విరివిగా వాడే అల్లంలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయట. ఇది శరీరంలో ఉత్పన్నమయ్యే పలు రకాల నొప్పులకు మంచి పరిష్కారంగా పని చేస్తుందట. అంతే కాకుండా నొప్పులు ఉన్న దగ్గర అల్లంతో కట్టు లాగా వేయడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయట. అయితే దీనికి చేయాల్సిందల్లా పచ్చి అల్లంని బాగా పేస్ట్ చేసుకొని ఒక పొడి గుడ్డలో దాన్ని పరిచి ఆ గుడ్డని నొప్పి ఉన్న ప్రదేశంలో కట్టులాగా కట్టాలి.
మంట అనిపిస్తుందట. కానీ కాసేపు ఓర్చుకుంటే క్రమంగా ఆ మంటతో పాటు నొప్పి కూడా తగ్గిపోతుందని చెబుతున్నారు. ఒళ్లు నొప్పులు తగ్గించడంలో యాపిల్ సైడర్ వెనిగర్ అద్భుతంగా పనిచేస్తుంది. మరి ముఖ్యంగా కాళ్ల నొప్పులను ఇది సులభంగా తగ్గిస్తుందట. ఇందుకోసం ఒక బకెట్ వేడి నీటిలో కాస్త యాపిల్ సైడర్ వెనిగర్ ను కలిపి ఒక పది నిమిషాలు పాటు నానబెట్టాలట. స్నానం చేసే వేడి నీటిలో కూడా ఒక మూత యాపిల్ సైడర్ వెనిగర్ ని కలుపుకోవడం వల్ల ఒంటి నొప్పులు తగ్గుతాయని చెబుతున్నారు. పసుపు కూడా ఇందుకు ఎంతో బాగా ఉపయోగపడుతుందట. పసుపులో పుష్కలంగా ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ,యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పలు రకాల ఇన్ఫెక్షన్స్ ని తగ్గించడంతో పాటు కండరాల నొప్పులను కూడా సులభంగా తగ్గిస్తాయట. పసుపు కొమ్మును నూరి మెత్తటి పేస్టు తయారు చేసుకుని ఆ పేస్టు నొప్పి ఉన్న లేపనం లాగా పూస్తే మంచి ఫలితం ఉంటుందట.