Curd: పెరుగు తింటున్నారా? మీకు అలాంటి నష్టాలు గ్యారెంటీ?
పెరుగును తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పెరుగు
- By Anshu Published Date - 06:30 AM, Sat - 29 October 22

పెరుగును తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పెరుగు మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అందుకే చాలామంది వేసవి వచ్చింది అంతే చాలు పెరుగు లేదా మజ్జిగను ఎక్కువ మొత్తంలో తీసుకుంటూ ఉంటారు. పెరుగు ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. పెరుగును తీసుకోవడం వల్ల అందులో ఉండే కాల్షియం ఎముకలను దంతాలను బలంగా చేస్తుంది. అలాగే పెరుగు కఫం వాతం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. జలుబు చేసినప్పుడు పెరుగులో కొద్దిగా బెల్లం మిరియాల పొడిని కలుపుకొని తింటే తొందరగా జలుబు తగ్గుతుంది.
అలాగే పెరుగుతో మూత్రశయ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. అలాగే పెరుగులో చక్కెరకు బదులుగా బెల్లాన్ని కలుపుకొని తినడం వల్ల అల్సర్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే తేనే పెరుగు కలుపుకుని తినడం వల్ల ఇన్ఫెక్షన్స్ తొందరగా తగ్గుతాయి. నోటి పూత దంత సమస్యలతో బాధపడేవారు పెరుగులో కొంచెం వామును కలిపి తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. కండరాలు బలోపేతం, కండరాలు బలంగా తయారవ్వాలంటే పెరుగులో ఓట్స్ కలిపి తీసుకోవాలి. అలాగే ఎండాకాలంలో ఎండలో ఎక్కువగా తిరిగినప్పుడు శరీరం తొందరగా డిహైడ్రేషన్ అవుతూ ఉంటుంది. అటువంటప్పుడు వీలైనంతవరకు మజ్జిగ ఎక్కువగా తాగుతూ ఉండాలి.
మజ్జిగ శరీరాన్ని హైబ్రిడ్జ్ గా ఉంచడంతోపాటు అధిక రక్తపోటు తో బాధపడే వారికి కూడా చక్కగా పనిచేస్తుంది. అధిక రక్త పోటు సమస్యతో బాధ పడేవారు ప్రతి రోజు ఒక కప్పు పెరుగును తినడం వల్ల హై బీపీ అదుపులో ఉంటుంది. పెరుగు తినడం వల్ల విరేచనాల సమస్య కూడా తగ్గుతుంది. విరోచనాల సమస్యతో బాధపడే వారు పురుగులో కొన్ని మెంతులు కలుపుకొని తినాలి. అలాగే పెరుగు గుండె సంబంధిత రోగాల నుంచి కూడా కాపాడుతుంది. పురుషులు ఎండు ద్రాక్ష పెరుగు కలుపుకుని తినడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. ఆస్తమాతో బాధపడే రోగులు పెరుగును అసలు తినకూడదు. ఆస్తమా రోగులు పెరుగు తినడం వల్ల ఆ సమస్య మరింత తీవ్రమవుతుంది. అలాగే జలుబు దగ్గు లాంటి సమస్యలు ఉన్నవాళ్లు పెరుగుకు దూరంగా ఉండాలి. జలుబుతో బాధపడుతున్నప్పుడు రాత్రి సమయంలో పెరుగు తినకూడదు. ఒకవేళ పెరుగు తింటే జలుబు మరింత ఎక్కువ అవుతుంది.బరువు తగ్గాలి అనుకున్న వారు పెరుగుకు దూరంగా ఉండాలి. పెరుగులో షుగర్ కలుపుకొని తింటే బరువు తగ్గడానికి బదులుగా విపరీతంగా బరువు పెరుగుతారు.