HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Health Tips Immunity Booster Drink For Winter Season

Health Tips: శీతాకాలంలో అలాంటి సమస్యలు రాకూడదంటే.. ఈ డ్రింక్ తాగాల్సిందే?

శీతాకాలం మొదలయ్యింది. చలి వణికిస్తోంది. దాంతో ప్రజలు ఇండ్లలో నుంచి రావాలి అని భయపడుతున్నారు. సూర్యోదయం అయిన తర్వాత బయటికి వస్తున్నారు. అ

  • Author : Anshu Date : 22-12-2023 - 5:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 22 Dec 2023 04 33 Pm 678
Mixcollage 22 Dec 2023 04 33 Pm 678

శీతాకాలం మొదలయ్యింది. చలి వణికిస్తోంది. దాంతో ప్రజలు ఇండ్లలో నుంచి రావాలి అని భయపడుతున్నారు. సూర్యోదయం అయిన తర్వాత బయటికి వస్తున్నారు. అయితే రోజు రోజుకి చలి తీవ్రత ఇంకా పెరుగుతూనే ఉంది. అయితే ఈ కాలంలో చలి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. చలికాలంలో జలుబు, దగ్గుల, ఆస్తమా ఇలా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. దీంతో ఏ పనైనా చేయాలంటే అలసట, నీరసం వస్తాయి. జలుబు వచ్చిందంటే బాడీ అంత వీక్ అయిపోయి జ్వరం తగిలినట్టుగా ఉంటుంది.

దగ్గు జలుబు కారణంగా కొంతమందికి తల భారంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అయితే శీతాకాలంలో అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే ఈ డ్రింక్ తాగాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ ఆ డ్రింక్ ఏది? దానిని తాగడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. స్పైసీ మిల్క్ తయారు చేసుకోవడానికి ముందుగా మసాలాను రెడీ చేసుకోవాలి. దీని తయారు చేసుకోవడానికి మనకు ఐదు పదార్థాలు కావాలి. దీనికి 200మి.లీ నెయ్యి, 300 గ్రాముల పసుపు, 50 గ్రాముల సొంటి పొడి, 25 గ్రాములు నల్ల మిరియాల పొడి 15 గ్రాముల దాల్చిన చెక్క పొడిని తీసుకోవాలి.

ఈ డ్రింకును తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసి లో ఫ్లేమ్ లో వేడి చేయాలి. తర్వాత ఇందులో పసుపు వేసి మూడు నిమిషాలు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మిగిలిన మసాలా పొడులు వేసుకోవాలి. తర్వాత పసుపు వాసన పోయేంతవరకు దాని రంగు మారేవరకు ఈ మిశ్రమాన్ని వేయించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. గాలి చొరబడని గాజు సీసాలో ఈ మిశ్రమాన్ని స్టోర్ చేసుకోవాలి. అయితే రాత్రి నిద్రపోయే ముందు ఒకటి స్పూన్ మిశ్రమాన్ని గోరువెచ్చని పాలలో వేసుకొని త్రాగాలి. ప్రతిరోజు ఈ పాలను తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఇమ్యూనిటీ బూస్టింగ్ డ్రింక్ ఒక నెల రోజుల పాటు తాగితే చలికాలంలో వచ్చే వ్యాధులను చెక్ పెట్టవచ్చు. ప్రతిరోజు ఈ స్పైసీ మిల్క్ తాగితే జలుబు, ఎలర్జీలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడవచ్చు. కాబట్టి చలికాలంలో వచ్చే సమస్యల నుంచి బయట పడాలంటే ఈ డ్రింక్ తాగాల్సిందే అంటున్నారు నిపుణులు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health tips
  • Immunity Booster
  • winter

Related News

Suffering from gastric problems? Do this, and your problem will vanish in a jiffy.

Gastric Problem: గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారా? ఇలా చేస్తే మీ సమస్య చిటికెలో మాయం!

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో పూర్తిగా మార్పులు వచ్చాయి. మనుషుల ఆహారపు అలవాట్ల కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో ముఖ్యమైనది గ్యాస్ట్రిక్ సమస్య. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు. కడుపులో ఉన్న ఆమ్లం అన్నవాహికలోకి తిరిగి వచ్చినప్పుడు అజీర్ణం సంభవిస్తుంది. దీం

    Latest News

    • ఒమాన్ తీరంలో నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భార‌త నావికులు మృతి

    • Mamata Banerjee: దీదీ కి భారీ షాక్

    • Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్‌పై పోలీస్ కంప్లైంట్.. డబ్బులు తీసుకుని ప్రమోషన్లకు రావడం లేదు

    • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..!

    • Lawrence Bishnoi: ఢిల్లీలో గురు రంధావా జిమ్‌పై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ సంచలన హెచ్చరిక

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd