Summer Foods: వేసవికాలంలో వేడి తట్టుకోవాలి అంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో మీకు తెలుసా?
వేసవికాలంలో ఎండ వేడిని తట్టుకోవాలి అంటే మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలని చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 10:01 AM, Fri - 21 March 25

రోజురోజుకీ ఎండ తీవ్రత పెరుగుతూనే ఉంది. భానుడు ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. ప్రజలు ఉదయం 10 దాటిన తర్వాత బయటికి రావాలి అంటేనే భయపడుతున్నారు. ఎండలు కూడా మండిపోతున్నాయి. అయితే ఇలా వేసవికాలంలో వేడి తట్టుకోవాలి అంటే సరైన ఆహార పదార్థాలు తీసుకోవాలి. లేదంటే ఎన్నో రకాల సమస్యలు తలెత్తవచ్చు. ఇదే విధంగా వేడి తట్టుకోవాలి అంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
గుమ్మడికాయ అలాగే పుచ్చకాయ తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని తినడం వల్ల వేడి తగ్గుతుంది. ఇవి మిమ్మల్ని హైడ్రేటెడ్ గా ఉంచడం మాత్రమే కాకుండా పోషకాలను కూడా అందిస్తాయి. ఎండాకాలంలో తీసుకోవాల్సిన వాటిలో కీరదోసకాయ కూడా ఒకటి. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది డిహైడ్రేషన్ ను నివారించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అలాగే ఆకుకూరలు కూడా వేసవిలో తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడే ఆహార పదార్థాలలో ఆకుకూరలు కూడా ఒకటి.
వేసవికాలంలో ఎక్కువగా తాగే పానీయాలలో మజ్జిగ కూడా ఒకటి. మజ్జిగ ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. మజ్జిగ చల్ల పరచడం మాత్రమే కాకుండా వేడి కారణంగా వచ్చే జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది అని చెబుతున్నారు. వేసవికాలంలో పెరుగును తరచుగా తినడం మంచిది. పెరుగు శరీరంని చల్లపరచడం మాత్రమే కాకుండా అవసరమైన ఎన్నో పోషకాలను కూడా అందిస్తుంది. వేసవికాలంలో చేపలు తినడం ఎంతో మంచిది అని చెబుతున్నారు. చికెన్ మటన్ కి బదులుగా చేపలు చాలా మేలు చేస్తాయట. అవకాడో కూడా శరీరంలో వేడిని తగ్గించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. కాబట్టి ఈ వేసవికాలంలో మీ శరీరం చల్లగా ఉండాలి అంటే తప్పనిసరిగా ఈ ఆహార పదార్థాలను మీ డైట్ లో భాగం చేసుకోవాల్సిందే.