Periods: పీరియడ్స్ టైమ్ లో వీటిని తింటే కడుపునొప్పి ఎక్కువ అవుతుందని మీకు తెలుసా?
పీరియడ్స్ సమయంలో స్త్రీలు కొన్ని రకాల ఆహార పదార్థాలను అస్సలు తినకూడదని వైద్యులు చెబుతున్నారు.
- By Nakshatra Published Date - 10:30 AM, Wed - 4 September 24
మామలుగా స్త్రీలకు ప్రతి నెల పీరియడ్స్ రావడం అన్నది సహజం. ఈ పీరియడ్స్ సమయంలో మూడు రోజుల నుంచి ఐదు రోజుల వరకు ప్రతి మహిళకు కష్టంగానే ఉంటుంది. ఈ పీరియడ్స్ వల్ల కడుపు నొప్పి నడుము నొప్పి అలాగే ఇతర సమస్యలతో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే ఇలాంటప్పుడు రెస్ట్ తీసుకోవాలని అలాగే ఆహార పదార్థాల విషయంలో సరైన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతుంటారు. కానీ కొంతమంది పీరియడ్స్ సమయంలో తెలిసి తెలియక కొన్ని రకాల ఆహార పదార్థాలను తింటూ ఉంటారు. వాటి వల్ల కడుపునొప్పి నడుము నొప్పి వంటి సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయట.
మరి పీరియడ్స్ సమయంలో ఎలాంటి పదార్థాలు తింటే ఆ నొప్పి మరింత ఎక్కువ అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పీరియడ్స్ సమయంలో స్త్రీలు ఎట్టి పరిస్థితులలో ఉన్న ఆహార పదార్థాలు తినకూడదట. ఉప్పు పరిమాణం పెరిగితే శరీరంలో నీరు నిల్వ ఉంటుంది. అది కడుపులో వాపు నొప్పి వంటి సమస్యలను మరింత పెంచుతుందని చెబుతున్నారు. అందుకే పీరియడ్స్ సమయంలో చిప్స్ స్నాక్స్ వంటివి తినకూడదని చెబుతున్నారు. అలాగే చాలామంది స్త్రీలు పీరియడ్స్ సమయంలో చాక్లెట్స్ కేక్స్ కుకీస్ వంటి తీపి పదార్థాలను తింటూ ఉంటారు. కానీ తీపి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల పీరియడ్స్ రోజులు మరింత కష్టంగా ఉంటాయట.
నిజానికి స్వీట్స్ ను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగి కడుపునొప్పితో పాటు మానసిక ఒత్తిడి, అలసట సమస్యలు కూడా పెరుగుతాయని చెబుతున్నారు. అలాగే నెలసరి సమయంలో జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ను తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని చెబుతున్నారు వీటిని తినడం వల్ల శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయి పెరిగి, దాని వల్ల గర్భాశయంలో వాపు వస్తుంది. ఇది పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం, ఎక్కువ నొప్పిని కలిగిస్తుందట. అలాగే పీరియడ్స్ సమయంలో తీసుకోకూడని ఆహార పదార్థాలలో కాఫీలు కూడా ఒకటి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ తిమ్మిరి వంటి సమస్యలు వచ్చి పీరియడ్స్ పెయిన్ మరింత పెరుగుతుందట. అలాగే పీరియడ్స్ సమయంలో కొన్ని రకాల సిట్రస్ పండ్లకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.
note: ఈ ఆరోగ్య సమాచారం సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
Related News
Dry Fruits: డ్రై ఫ్రూట్స్ తింటే నిజంగానే బరువు పెరుగుతారా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!
డ్రై ఫ్రూట్స్ తినేవాళ్లు తప్పకుండా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.