Garlic Tea: చలికాలంలో అలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే వెల్లుల్లి టీ తాగాల్సిందే?
చలికాలం మొదలయింది అంటే చాలు సీజనల్ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. దగ్గు జలుబు వంటి సమస్యలతో పాటు చర్మ సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటారు.
- Author : Anshu
Date : 18-12-2023 - 2:59 IST
Published By : Hashtagu Telugu Desk
చలికాలం మొదలయింది అంటే చాలు సీజనల్ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. దగ్గు జలుబు వంటి సమస్యలతో పాటు చర్మ సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి వాటికి చెక్ పెట్టాలంటే చలికాలంలో వెల్లుల్లి టీ తాగాల్సిందే అంటున్నారు వైద్యులు. మరి చలికాలంలో వెల్లుల్లి టీ తాగడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఎప్పుడు మనం తెలుసుకుందాం.. చలికాలంలో వెల్లుల్లి టీ తీసుకోవడం వలన చలికాలంలో వచ్చే సమస్యలు దూరం అవుతాయి. వెల్లుల్లిలో విటమిన్ సి, సెలీనియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం, జింక్, కాపర్, రైబో ఫ్లైవిన్ వంటి మూలకాలు ఉంటాయి.
వీటితోపాటు యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఉంటాయి. ఇవి అనేక వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడుతుంది. చలికాలంలో జలుబు, దగ్గు అనేది సర్వసాధారణమైన సమస్య. అయితే జలుబు, దగ్గు ఉన్నప్పుడు వెల్లుల్లి టీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ బయాటిక్ గుణాలు దగ్గు, జలుబు సమస్యలను దూరం చేస్తాయి. ఖాళీ కడుపుతో వెల్లుల్లి టీని తాగడం వలన శరీరంలో ట్యాక్సిన్ తొలగిపోతుంది. ఎందుకంటే ఖాళీ కడుపుతో వెల్లుల్లి టీ ని తీసుకోవడం వలన శరీరం డిటాక్సిఫై అవుతుంది.
దీనివలన చర్మానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. అలాగే చర్మం కూడా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. వెల్లుల్లి టీ లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనివలన శరీరం వైరస్, బ్యాక్టీరియాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. వెల్లుల్లి టీ తీసుకోవడం వలన పొట్ట సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ఎందుకంటే వెల్లులి టీ తీసుకోవడం వలన జీవ క్రియ మెరుగుపడుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీనివలన జీర్ణ క్రియకు సంబంధించిన అనేక సమస్యలు తొలగిపోతాయి.