HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Health Tips A Simple Tip To Help Your Kids Stop Eating Chips

Health Tips: మీ పిల్లలు చిప్స్ తినడం మానాలంటే ఈ చిన్న చిట్కా చాలు!

  • Author : Vamsi Chowdary Korata Date : 11-10-2024 - 3:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Health Tips
Health Tips

Health Tips: చిప్స్ అనే మాట విన్నగానే చాలామంది నోరూరిపోతారు, ముఖ్యంగా పిల్లలు. ఇంట్లో తయారైన ఆహారం కంటే చిప్స్‌ను ఎక్కువగా తింటారు. అప్పుడప్పుడు తింటే పర్లేదు కానీ , తరచుగా తింటుంటే ఆ అలవాటును మానించడం మంచిదని ప్రఖ్యాత న్యూట్రిషనిస్టులు పేర్కొన్నారు. చిప్స్‌ను తరచూ తినడం పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే, ఈ అలవాటును ఎలా మాన్పించాలో మరియు అది ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపిస్తుందో ఈ కథలో తెలుసుకుందాం.

సాధారణంగా చిప్స్‌ను రెండు విధాలుగా తయారు చేస్తారు. ఒకటి బంగాళాదుంప (Aloo), అరటి వంటి పదార్థాలతో, మరొకటి పిండితో తయారుచేస్తారు. వీటిని ఎక్కువగా ఆయిల్‌లో వేయిస్తారు. ఇంట్లో చేసిన చిప్స్ కాస్త బాగుంటాయి, కానీ బయట దొరికే స్నాక్స్‌లో రకరకాల మసాలాలు, కారప్పొడులు, ఉప్పు వంటి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఉపయోగించడం వలన తీవ్రమైన అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది, అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కంటి చూపు కోల్పోవడానికి అవకాశం ఉంది:

చిప్స్ తినిన పిల్లలకు వెంటనే పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది, దీంతో వారు వేరే ఆహారం తినాలని అనుకోరు. అయితే, మీ పిల్లలు ఎక్కువగా చిప్స్ తింటున్నారు అంటే, ఈ విషయాలు తెలుసుకోవడం అత్యంత అవసరం.

చిప్స్‌లో క్యాలరీలు అధికంగా ఉండడం ఒక ముఖ్యమైన అంశం. వీటితో పిల్లలకు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందవు. ఈ కారణంగా ఐరన్‌, జింక్‌, విటమిన్‌-ఎ, సి లోపాలను కలిగి ఉండొచ్చు. అంతేకాకుండా, త్వరగా అలసిపోవడం, అనారోగ్యానికి బలమైన ప్రతిబంధకాలు ఏర్పడడం, చివరికి కంటి దృష్టి కోల్పోవడం వంటి సమస్యలు కూడా రావొచ్చు.

కాబట్టి, మీ పిల్లలు చిప్స్ ఎక్కువగా తింటున్నట్లయితే, వెంటనే ఈ అలవాటును మాన్పించడం మంచిదని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు.

చిప్స్ తినే అలవాటును ఎలా తగ్గించాలి?

పిల్లలు ఒక్కసారిగా చిప్స్ తినడం మానడం కష్టం. అందుకే, నెమ్మదిగా వారితో మానిపించేందుకు ప్రయత్నించాలి.

వారం పదిరోజులకోసారి చిప్స్ ఇచ్చి, అవి ఎక్కువగా తినడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి వారికి వివరించాలి. అలాగే, పిల్లల రోజువారీ భోజనంలో నూనె, పప్పు గింజలు, తృణధాన్యాలతో పాటు కూరగాయలు, ఆకుకూరలు, అన్ని పండ్లను తప్పనిసరిగా తినేలా చూడాలి.

ఇలా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలవాటుగా చేసుకుంటే, పిల్లలు క్రమంగా చిప్స్ అడగడం మానేస్తారని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Banana Chips
  • chips Side Effects
  • health tips
  • potato chips
  • Side Effects Of chips

Related News

    Latest News

    • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

    • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

    • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

    • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

    • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd