Exercises for Men: మగాళ్లు అందంగా ఉండాలంటే ఈ మూడు ఎక్సర్ సైజులు చేయాల్సిందే.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి?
ప్రస్తుత కాలంలో ఆడవారు మగవారు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా అందం,ఆరోగ్యం, ఫిట్నెస్ పై అనేక రకాల
- By Nakshatra Published Date - 06:30 AM, Sun - 13 November 22
ప్రస్తుత కాలంలో ఆడవారు మగవారు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా అందం,ఆరోగ్యం, ఫిట్నెస్ పై అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మగాళ్ళు అయితే ఫిట్నెస్ కు తగ్గట్టుగా అందంగా ఉండాలి అనుకుంటూ ఉంటారు. అయితే ఎక్సర్సైజ్ చేయడం వల్ల చర్మం వెంట్రుకలు కాపాడుకోవచ్చు అన్న విషయం చాలామందికి తెలియదు. ఫిట్నెస్ విషయంలో ఏ విధంగా అయితే వ్యాయామాలు ఉన్నాయో అదేవిధంగా జుట్టు, చర్మ సంరక్షణ కోసం కూడా ప్రత్యేకమైన వ్యాయామాలు ఉన్నాయి.
అయితే మనం రోజు చేసే వ్యాయామాలతో పాటుగా బెల్లిఫ్యాట్, పొట్ట తగ్గించుకోవడంతో పాటు చర్మం జుట్టును సంరక్షించుకోవచ్చు. అయితే మూడు రకాల ఎక్సర్సైజ్ లు చేయడం వల్ల అవి మీ అందాన్ని పెంచడంతోపాటు ఫిట్నెస్ గా ఉంచుతాయి. అవి స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్‌లు, చెస్ట్ ప్రెస్. మరి ఈ మూడు ఎక్సర్సైజ్ లు ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వ్యాయామంలో స్క్వాట్స్ చాలా కీలకమైనది. ఈ వ్యాయామంలో ఒక చోట నిల్చొని, పాదాలు, మోకాళ్లు ఆధారంగా కుర్చీలో వెనుకకు కూర్చున్నట్టు బెండ్ అవుతూ లేవడాన్ని స్క్వాట్స్ అంటారు.
ఇలా వెంటవెంటనే ఈ వ్యాయామాన్ని చేయాలి. ప్రారంభంలో స్టాండర్డ్ స్క్వాట్ చేయాలి. డెడ్‌లిఫ్ట్ కూడా వెయిట్ లిఫ్టింగ్ లాగే ఉంటుంది. అందుకోసం రాడ్‌కు డార్బెల్స్, బార్స్ లోడ్ చేసిన దాన్ని ఎత్తడమే డెడ్‌లిఫ్ట్. నేలపై ఉన్న ఈ బరువును చేతులపై ఎత్తాలి. అలాగే ఇందులో బరువు పెంచాలనుకుంటే బార్స్ వెయిట్ పెంచితే సరిపోతుంది. చెస్ట్ పై ఒత్తిడి కలిగే విధంగా చేసే ఎక్సర్‌సైజ్‌లను చెస్ట్ ప్రెస్ అంటారు. జిమ్‌లోని వివిధ పరికరాలతో ఈ చెస్ట్ ప్రెస్ వ్యాయామాలు చేయవచ్చు. వీపు భాగంలో ఆధారం ఉంచుకొని ఈ చెస్ట్ ప్రెస్ ఎక్సర్సైజ్లు చేయాలి. కేబుల్, డంబుల్స్ సాయంతో కూడా ఇవి చేయవచ్చు.
Related News
Lizard Astrology for Female: స్త్రీ శరీరంపై బల్లి ఎక్కడ పడితే ఏమవుతుంది?
బల్లి అనగానే భయంతో ఆమడ దూరం వెళ్ళిపోతాం. పైగా బల్లి మనమీధపడితే ఒళ్ళు జలదరింపు మాట అటుంచితే ఎన్నెన్నో అనుమానాలు.. ఏదో అపచారం జరిగిపోతుందని భయాందోళనలు .. చివరకి కథ కంచి వరకు చేరుతుంది. అక్కడకు వెళ్లి బంగారు బల్లి ముట్టుకుని వచ్చేవరకు మనశ్శాంతి ఉందదు