HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Health Benefits Of Jeera

Jeera: జీరాలో ఎన్ని బెనెఫిట్స్ ఉన్నాయో తెలుసా?

ఇప్పుడు లైఫ్ స్టైల్ మారింది.. ఫుడ్ హ్యాబిట్స్ మారాయి. దీనివల్ల చాలామంది ఈజీగా బరువు పెరుగుతున్నారు. పెరగడం పెరిగిపోతున్నారు.. కానీ తగ్గడానికి మాత్రం నానాతంటాలు పడుతున్నారు. ఈ బరువుని తగ్గించుకోవడానికి డైటింగ్, ఎక్సర్‌సైజ్‌లు చేయడం మొదలు పెడతారు.

  • Author : Hashtag U Date : 20-04-2022 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

ఇప్పుడు లైఫ్ స్టైల్ మారింది.. ఫుడ్ హ్యాబిట్స్ మారాయి. దీనివల్ల చాలామంది ఈజీగా బరువు పెరుగుతున్నారు. పెరగడం పెరిగిపోతున్నారు.. కానీ తగ్గడానికి మాత్రం నానాతంటాలు పడుతున్నారు.
ఈ బరువుని తగ్గించుకోవడానికి డైటింగ్, ఎక్సర్‌సైజ్‌లు చేయడం మొదలు పెడతారు. అలా బరువు తగ్గాలని అనుకునే వారికి జీలకర్ర టీ ఓ వరం అనే చెప్పాలి. వాము, జీలకర్రతో చేసిన ఈ టీని మూడు నెలల పాటు డైలీ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
జీరా టీ వల్ల ఇలా బరువు తగ్గొచ్చు..
రోజూ ఆహారంలోకి జీలకర్ర తీసుకోవడంతోపాటు, వాటిని జ్యూస్ చేసి తాగడం వలన శరీరంలోని కొవ్వు తగ్గుతుంది. తాజాగా ఓ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలువడింది. ఆ సంస్థ వారు 80 మంది మహిళలను రెండు గ్రూపులుగా విడదీశారు. అందులో కొంత మంది జీలకర్రను ఉపయోగించగా.. మిగతావారు ఇతర డైట్ కంట్రోల్‏ను వాడారు. ఇందులో ఇతర డైట్ వాడినవారి కంటే జీలకర్రను వాడినవారు త్వరగా బరువు తగ్గినట్లు తేలింది.

జీలకర్రను డైలీ ఉపయోగించిన వారికి బరువు తగ్గడంతో పాటు.. రక్తం మొత్తం శుభ్రమవుతుంది. అంతేకాదు శరీరంపై ఉన్న ముడతలు పోయి యవ్వనంగా కనిపిస్తారు. ఎముకలు బలంగా తయారవుతాయి. కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి.
కంటి చూపు మెరుగవుతుంది. పళ్లు, చిగుళ్లు బలంగా ఆరోగ్యంగా తయారవుతాయి. మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. రక్తప్రసరణ, గుండె పనితీరు మెరుగవుతుంది. దీర్ఘకాలికంగా దగ్గుతో బాధపడుతున్న వారికి ఇది చక్కటి ఔషధంగా పనిచేస్తుంది.
జీరా టీ తయారీ విధానం..
ఒక గ్లాస్ నీటిలో అర టీస్పూన్ వాము, ఒక టీస్పూన్ జీలకర్ర వేసి రెండు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఐదు నిమిషాల పాటు మరిగించాలి. వేడి చేసిన నీటిని వడకట్టి నాలుగు చుక్కలు నిమ్మరసం వేసుకుని తాగాలి. రుచి కోసం అల్లం లేదా పుదీనా ఆకులు కూడా కలుపుకోవచ్చు. నిమ్మ రసం రుచి నచ్చకపోతే ఒక టీస్పూన్ తేనె కూడా కలుపుకోవచ్చు. కేవలం బరువు తగ్గడంలోనే కాకుండా ఈ వాము, జీలకర్ర టీతో ఇంకా చాలా రకాలు ప్రయోజనాలు ఉన్నాయి. వాము, జీలకర్ర పొడిని మూడు నెలల పాటు ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలు మల, మూత్ర, చెమట ద్వారా బయటకొచ్చేస్తాయి. దీంతో జీర్ణక్రియ సరిగా పనిచేస్తుంది.
ఇలా కూడా వాడొచ్చు..
జీలకర్ర రోజూ తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడి పేగులను ఆరోగ్యకరంగా ఉంచుతుంది. ఇందులో ఐరన్ ఉండడం వల్ల మన శరీరానికి కావాల్సిన ఐరన్ శక్తిని అందిస్తుంది. వీటితోపాటు శరీరంలో ఉండే కొలెస్ట్రాల్‏ను బయటకు పంపుతుంది. శరీరంలో మంటను తగ్గించి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఒక టీస్పూన్ జీలకర్రను ఒక టీస్పూన్ పెరుగుతో కలిపాలి. ఆ మిశ్రమాన్ని ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత తినాలి. ఇలా కనీసం 15 రోజులు చేసినా.. క్రమంగా బరువు తగ్గుతారు. రాత్రి సమయంలో జీలకర్రను నానబెట్టి.. ఉదయాన్నే మరిగించాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని వడకట్టి తాగాలి. అందులో కాస్త నిమ్మకాయ కలిపి తాగితే రుచి బాగుంటుంది. ఇలా 2 వారాల పాటు చేస్తే బరువు తగ్గొచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • exercises
  • good health
  • jeera
  • Life Style

Related News

7 Tips to Curb Insomnia for Stress Management

Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Stress Management: “ఒత్తిడి” అనేది మనం చేసే రోజువారీ కార్యకలాపాలకు శరీరం యొక్క సహజ ప్రతిస్పందన. రోజూ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. నిద్రలేమి వల్ల కలిగే అలసట మిమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. నిద్రలేమి సమస్యకు గల ప్రధాన కారణాల్లో ముఖ్యమైనది ఫోన్‌కు అడిక్ట్ కావడం. నిద్రపోవడానికి ముందు వరకు ఫోన్‌లో మునిగిపోవడం అనేది మీ నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది.

  • Don't worry about low sperm count... follow these Ayurvedic tips and you'll be at the peak of virility...!!

    Sperm Count In Men: స్పెర్మ్ కౌంట్ తగ్గిందని బాధపడకండి… ఆయుర్వేదంలో ఈ చిట్కాలు పాటిస్తే మీరే మగమహారాజు…!!

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd