Dry Raisins: ఎండుద్రాక్ష వల్ల కలిగే లాభాల గురించి తెలిస్తే వెంటనే తినడం మొదలు పెడతారు?
ఎండు ద్రాక్ష వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికి తెలిసిందే. ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే వైద్యుల
- By Nakshatra Published Date - 04:00 PM, Tue - 13 February 24
![Dry Raisins: ఎండుద్రాక్ష వల్ల కలిగే లాభాల గురించి తెలిస్తే వెంటనే తినడం మొదలు పెడతారు?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/02/MixCollage-13-Feb-2024-02-40-PM-4931.jpg)
ఎండు ద్రాక్ష వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికి తెలిసిందే. ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే వైద్యులు కూడా తరచూ ఎండు ద్రాక్షని తినమని చెబుతూ ఉంటారు.. అయితే ఈ ఎండు ద్రాక్ష వల్ల కలిగే జాగ్రత్తలు ప్రయోజనాల గురించి చాలామందికి తెలియక వాటిని తినడం మానేస్తూ ఉంటారు. కానీ వాటి వల్ల కలిగే లాభాల గురించి తెలిస్తే మాత్రం వెంటనే కొనుగోలు చేసి తినడం మొదలుపెడతారు. మరి ఎండు ద్రాక్ష వల్ల కలిగే లాభాల విషయానికొస్తే.. ఎండు ద్రాక్ష ఒక బెస్ట్ ఆంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తాయి. ఇంకా ఈ ఎండు ద్రాక్షాలను పరిమితంగా తింటే ఫ్యాట్ కొలెస్ట్రాల వంటి సమస్యలు కూడా దరిచెరవు. ఎండు ద్రాక్షాలు అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
ఎండు ద్రాక్షాలు ఐరన్ పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. అందువల్ల ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అంతేకాదు ఎండు ద్రాక్షాలు నేచురల్ షుగర్స్ అత్యద్భుతంగా ఉన్నాయి. ఎండు ద్రాక్షలో కూడా వివిధ రకాలు ఉంటాయి. వాటిలో గోల్డెన్ కలర్ వి గ్రీన్ కలర్ వి అలాగే బ్లాక్ కలర్ వి ఇలా దొరుకుతూ ఉంటాయి. మీరు ఏది తీసుకున్నా పోషకాలు ఒకేలా ఉంటాయి. ఈ ఎండుద్రాక్ష తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్లు నాచురల్ షుగర్లతో ఎండు ద్రాక్షాలో నిండు ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు కొన్ని ఎండు ద్రాక్షాలు తినడం వల్ల మన శరీరానికి కావాల్సినంత శక్తి అందుతుంది. అంటే ఇన్స్టెంట్గా శక్తి వస్తుంది. ఇక బరువు తగ్గాలి అనుకునే వారికి ఎండు ద్రాక్షాలు మంచి ఆప్షన్ ఇవి ప్రతిరోజు తింటే బరువు తగ్గుతారు.
కాబట్టి మీరు బరువు తగ్గడానికి ఏమైనా డైటింగ్ చేస్తుంటే మీ డైకిషన్ లేదా మీ డాక్టర్ సలహా మేరకు ఎండు ద్రాక్ష కూడా మీ డైట్ లో చేర్చండి. ఎండు ద్రాక్షాలు వంటల్లో వాడుతూ ఉంటారు. కొంతమంది నేరుగా తింటూ ఉంటారు. వీటికంటే కూడా నీటిలో నానబెట్టి తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుకోవచ్చు. నీటిలో నానబెట్టిన ఎండు ద్రాక్షాలు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. దీనికి ఏం చేయాలి అంటే ఒక ఎనిమిది నుండి 10 ఎండుద్రాక్షలను శుభ్రంగా వాష్ చేసి ఒక గ్లాసు గాని ఒక చిన్న గిన్నెలో గాని వేసి నీళ్లు పోసి నాన్ననివ్వండి. వీటిని ఉదయం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుని పాలలో కలుపుకుని తాగొచ్చు. లేదా నమిలి తినడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అలా నమిలి తిన్న తర్వాత ఈ నీటిని పడబోయకండి. పరగడుపున ఈ నీటిని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందుకుంటారు. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా మరియు ఇతర ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. ఎండుద్రాక్షలో క్యాల్షియం మైక్రో న్యూట్రిషన్లు అధికంగా ఉంటాయి. ఇవి బోన్ హెల్త్ ని మెరుగుపరచడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి. ఎండు ద్రాక్ష రెగ్యులర్గా డైట్లో చేర్చుకుంటే వీక్నెస్ అనే మాట ఉండదు. అయితే పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.తగ్గించే పొటాషియం మెగ్నీషియం అధికంగా ఉంటాయి.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Jaggery Benefits: నిద్రపోయే ముందు బెల్లం తీసుకుంటే బోలెడు లాభాలు..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/01/New-Project-66.jpg)
Jaggery Benefits: నిద్రపోయే ముందు బెల్లం తీసుకుంటే బోలెడు లాభాలు..!
మీరు మీ ఆహారంలో బెల్లం (Jaggery Benefits) చేర్చవచ్చు. క్రమం తప్పకుండా పరిమిత పరిమాణంలో బెల్లం తీసుకోవడం వల్ల హాని కాకుండా లాభాలు వస్తాయి.