Curd Benefits: వామ్మో.. పెరుగు తినడం ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయా?
పెరుగు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ కొంతమంది
- By Nakshatra Published Date - 04:55 PM, Thu - 27 April 23
పెరుగు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ కొంతమంది పెరుగును అమితంగా తింటే మరి కొంతమంది మాత్రం పెరుగు తినడానికి అంతగా ఇష్టపడరు. చాలామంది పెరుగు తినడం వల్ల లావు పెరిగిపోతామేమో అని భయపడి పెరుగును తినకుండా ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే పెరుగు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగు వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరు. పెరుగులో కాల్షియం భాస్వరం, ప్రోటీన్, లాక్టోస్ పుష్కలంగా ఉంటాయి.
కాల్షియం వల్ల ఎముకలు, దంతాలు గట్టిపడతాయి. పెరుగులో కాస్తా మిరియాల పొడి, బెల్లం పొడి కలిపి తింటే జలుబు నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. పెరుగు, ఎండుద్రాక్ష కలిపి తింటే శరీరానికి ఇ, ఎ, సి, బీ 2, బీ12 విటమిన్లతోపాటు కెరోటోనాయిడ్స్ అందుతాయి. ప్రతి రోజూ పెరుగు తినడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. పెరుగులో అతిగా చక్కెరకు బదులు తేనె కలిపి తాగితే అల్సర్ తగ్గుతుంది. పెరుగును లో ఉండే గుణం కారణంగా గ్యాస్ ట్రబుల్ సమస్య తగ్గి పోవడంతో పాటు పలు ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా రెగ్యులర్ గా పెరుగును తీసుకోవడం మంచిది. రాత్రి సమయంలో నిద్రలోకి ఈజీగా జారుకునేందుకు చల్లటి పెరుగు తింటే ప్రయోజనం ఉంటుంది.
తరచుగా పెరుగు తినడం వల్ల అధిక బరువు సమస్యను తగ్గించుకోవచ్చు. పెరుగులో కొవ్వు తక్కువగా ఉండి ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి.కాబట్టి కొద్దిగా పెరుగు అన్నం తినడం వల్ల కావాల్సిన శక్తి లభిస్తుంది. తద్వార శరీరంలో అదనపు కొవ్వు పేరుకు పోవడం జరగదు. పెరుగు తినడం వల్ల ఎముకలకు కావాల్సిన కాల్షియం అందుతుంది. తరచుగా పెరుగును ఆహారంలోకి చేర్చుకోవడం వల్ల మెల్ల మెల్లగా కొవ్వు కరిగిపోయి బరువు తగ్గుతారు. పాలు తాగడం కుదరని వారు దానికి ప్రత్యామ్నాయంగా పెరుగు తినవచ్చు. పాలలో ఉండే కాల్షియం పెరుగులో కూడా ఉంటుంది. పెరుగులో ఉండే పొటాషియం వల్ల బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది. ఎవరైతే పెరుగు అన్నం రాత్రి సమయంలో తింటారు వారికి సుఖ నిద్ర లభిస్తుంది. కాల్షియ లోపంతో బాధపడేవారు ఆహారంలో తప్పకుండా పెరుగును చేర్చుకోవాలి. రోగ నిరోదక శక్తి పెరగడంతో పాటు పలు ప్రోటీన్లను శరీరంకు అందిస్తుంది.
Related News
Benefits Of Kundru: దొండకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. దొండకాయలో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణ ప్రక్రియను సజావుగా అమలు చేయడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం మరియు అపానవాయువు వంటి సమస్యలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.