Ghee: చపాతీలపై నూనెకు బదులు నెయ్యి రాసుకొని తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
చపాతీలపై నువ్వు నూనెకు బదులు నెయ్యి రాసుకునే తింటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని,ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 04:03 PM, Tue - 13 May 25

భారతీయుల వంటకాలలో ఎక్కువగా చేసే ప్రధాన ఆహార పదార్థాలలో చపాతీ కూడా ఒకటి. ఈ చపాతిని ఎప్పుడు పడితే అప్పుడు చేసుకొని తింటూ ఉంటారు. బ్రేక్ ఫాస్ట్ లంచ్ డిన్నర్ అని సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉంటారు. అయితే రాజస్థాన్ వంటి ప్రాంతాలలో చపాతీలపై నూనెకు బదులుగా నెయ్యి వేసుకుని తింటూ ఉంటారు. ఇది రుచిని పెంచడం మాత్రమే కాకుండా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని చెబుతున్నారు. చపాతీపై నూనెకు బదులుగా నెయ్యి జాసుకొని తింటే ఏం జరుగుతుందో ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
నెయ్యి చపాతీకి మంచి రుచిని అందిస్తుందట. దీని సువాసన ఆహారాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుందట. అలాగే కడుపు నిండుగా తిన్న భావన అందిస్తుందట. కాగా నెయ్యిలో బ్యూటిరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని పెంపొందించి, జీర్ణక్రియను సులభతరం చేస్తుందట. ఇది జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందట. తిన్న ఆహారం నేరుగా పేగుల్లో నిలిచి పోకుండా కిందకు జారేలా చేస్తుందని చెబుతున్నారు. నెయ్యి లోనే ఆరోగ్యకరమైన కొవ్వులు చపాతీ ఇతర ఆహారాల్లోని కొవ్వులు కరిగే విటమిన్లు మెరుగుపరిచి కొవ్వులు ఇతర చపాతీ ఇతర ఆహారాల నుండి కొవ్వు కరిగే విటమిన్ లను శోషించడంలో సహాయపడతాయట.
నెయ్యి కేలరీలు అధికంగా ఉండే ఆహారం కాబట్టి ఇది త్వరిత శక్తిని అందిస్తుందట. కాగా చురుకైన జీవనశైలి ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక అని చెబుతున్నారు. నెయ్యిని మితంగా తీసుకుంటే ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలో వాపులు తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయట. నెయ్యి చపాతీలను మృదువుగా, తేమగా ఉంచుతుందట. దీనివల్ల అవి పొడిబారకుండా ఉంటాయట. ఇది చపాతీల ఆకృతిని మెరుగుపరుస్తుందట. చపాతీలు ఎంత సమయమైనా ఎండిపోయినట్టుగా కాకుండా మెత్తగా ఉండేలా చేస్తుందని చెబుతున్నారు. కాబట్టి చపాతీలు నూనెకు బదులు నెయ్యి వేసుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు.