HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Guillain Barre Syndrome Spreading In India A Life Threatening Neurological Disorder 5 Deadly Symptoms

GB Syndrome Symptoms : జీబీఎస్‌ ‘మహా’ కలకలం.. ఏమిటీ వ్యాధి ? లక్షణాలు ఎలా ఉంటాయ్ ?

‘గిలైన్ బారె సిండ్రోమ్‌’ (GBS) అనేది ఒక అరుదైన నాడీ సంబంధిత వ్యాధి(GB Syndrome Symptoms). 

  • By Pasha Published Date - 01:27 PM, Mon - 27 January 25
  • daily-hunt
Guillain Barre Syndrome Neurological Disorder Symptoms Maharashtra Pune

GB Syndrome Symptoms : ‘గిలైన్ బారె సిండ్రోమ్‌’ (Guillain-Barre Syndrome) మహారాష్ట్ర‌లో కలకలం రేపుతోంది. దీని బారినపడి సోలాపుర్‌ జిల్లాలో ఓ వ్యక్తి చనిపోయాడు. అతడి మరణానికి  జీబీఎస్ (గిలైన్ బారె సిండ్రోమ్‌) కారణమని వైద్యవర్గాలు అనుమానిస్తున్నాయి.  రాష్ట్రంలోని పూణేలో నమోదైన జీబీఎస్ కేసుల సంఖ్య 101కి పెరిగింది. ఈ బాధితుల్లో 16 మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. జీబీఎస్ లక్షణాలతో చనిపోయిన సోలాపూర్ వాస్తవ్యుడు కూడా పూణేలోనే చికిత్స పొందాడు. జీబీఎస్ వ్యాధి చికిత్స ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ చికిత్స  పొందే క్రమంలో తీసుకోవాల్సిన ఇమ్యునోగ్లోబిన్‌ ఇంజెక్షన్లు ఒక్కో దాని ధర వేలల్లో ఉంటుంది. మహారాష్ట్ర ప్రభుత్వం సర్కారీ ఆస్పత్రుల్లో ఉచితంగా జీబీఎస్‌ చికిత్సను అందిస్తోంది. ఇంతకీ ఏమిటీ ‘గిలైన్ బారె సిండ్రోమ్‌’. ఇది సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు బయటపడతాయి ? ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :YS Jagan : జగన్‌కు ఊరట.. అక్రమాస్తుల కేసుల బదిలీకి ‘సుప్రీం’ నో.. రఘురామ పిటిషన్‌ వెనక్కి

ఏమిటీ ‘గిలైన్ బారె సిండ్రోమ్‌’ ?

  • ‘గిలైన్ బారె సిండ్రోమ్‌’ (GBS) అనేది ఒక అరుదైన నాడీ సంబంధిత వ్యాధి(GB Syndrome Symptoms).
  • ఈ వ్యాధి వచ్చిన వారికి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థే శత్రువుగా మారుతుంది. అది శరీరంలోని నరాలపై దాడి చేస్తుంది. దీనివల్ల నరాలు వీక్ అవుతాయి. ఫలితంగా శరీరంలో తిమ్మిర్లు పెరుగుతాయి. క్రమంగా పక్షవాతం వచ్చే రిస్క్ ఉంటుంది.
  •  జీబీఎస్ వ్యాధి ఎందుకు వస్తుంది ? అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు.
  • ఈ వ్యాధి రావడానికి కనీసం ఆరువారాల ముందు నుంచే శరీరంలో లక్షణాలు బయటపడతాయి.
  • జీబీఎస్ వ్యాధి ముందస్తు లక్షణాలు ఈకింది విధంగా ఉంటాయి.
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.
  • గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్ రావచ్చు.
  • ఆరోగ్యపరంగా చాలా బలహీనం అవుతారు. బలహీనత అనేది తొలుత పాదాల్లో, కాళ్లలో కనిపిస్తుంది.
  • కాళ్ల భాగం నుంచి శరీరంలోని ఇతరత్రా భాగాల వైపుగా బలహీనత పెరుగుతూపోతుంది.
  • చేతులు, మొహం, ఊపిరితిత్తుల దాకా బలహీనత వ్యాపిస్తుంది.
  • మెట్లు ఎక్కడం కూడా కష్టతరం అయ్యేంత స్థాయిలో ఊపిరితిత్తులు బలహీనపడతాయి.
  • మొహం పాలిపోయినట్లుగా తయారవుతుంది.
  • నరాలు దెబ్బతినడం వల్ల మెదడుకు అసాధారణ సెన్సరీ సిగ్నల్స్ అందుతాయి. ఆ సిగ్నల్స్ మెదడు నియంత్రణలో ఉండవు.
  • పై లక్షణాలన్నీ బయటపడిన తర్వాత జీబీఎస్ రోగికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు పెరుగుతుంది.
  • చేతులు, కాళ్లలో నొప్పులు పెరుగుతాయి. ఈ నొప్పులు రాత్రిటైంలో బాగా పెరుగుతాయి.
  • గుండె కొట్టుకునే రేటు, బీపీ అసాధారణంగా పెరుగుతాయి.
  • మూత్రాశయ సమస్యలు మొదలవుతాయి.
  • శరీరాన్ని పరీక్షించి, వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే జీబీఎస్ సమస్యపై వైద్యులు నిర్ధారణకు వస్తారు.
  • ప్రస్తుతానికి జీబీఎస్ వ్యాధికి నిర్దిష్ట వైద్య చికిత్స లేదు. దాని తీవ్రతను తగ్గించుకునే తాత్కాలిక చికిత్సా మార్గాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
  • చికిత్స ఒకవేళ అనుకూలిస్తే కొన్ని వారాల్లోనే రోగి కోలుకునే అవకాశం ఉంటుంది.
  • ఒకవేళ చికిత్స అనుకూలించకుంటే కొన్ని సంవత్సరాల పాటు ఈ వ్యాధితో బాధపడాల్సి వస్తుంది.

Also Read :IndiGo : ఇదొక ర‌క‌మైన వేధింపు ..మంచు లక్ష్మి


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • GB Syndrome Symptoms
  • Guillain Barre Syndrome
  • india
  • Maharashtra
  • Neurological Disorder
  • Pune

Related News

Commonwealth Games

Commonwealth Games: అహ్మదాబాద్‌లో చరిత్రాత్మక ఘట్టం.. 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య నగరం ఖరారు!

భారతదేశం మొదటిసారిగా 1934లో కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంది. ఈ క్రీడల్లో భారత అథ్లెట్లు ఇప్పటివరకు మొత్తం 564 పతకాలు సాధించారు. ఇందులో 202 స్వర్ణం, 190 రజతం, 171 కాంస్య పతకాలు ఉన్నాయి.

  • Nepal Currency

    Nepal Currency: ఇకపై చైనాలో నేపాల్ కరెన్సీ ముద్రణ.. భారతదేశం ఎందుకు వైదొలిగింది?

  • Hal Gubbi Volcano

    Volcano : బద్దలైన అగ్నిపర్వతం.. భారత్ పై ఎఫెక్ట్

  • Indian Girl

    Indian Girl: చైనాలో భార‌త మహిళకు వేధింపులు.. 18 గంటలు హింసించిన అధికారులు!

  • India

    India: పాకిస్తాన్‌కు భారత్ భారీ షాక్.. కొత్త ఆయుధంతో వణుకుతున్న శత్రుదేశాలు!

Latest News

  • Back Pain: వెన్ను నొప్పితో బాధపడుతున్నారా? ఉపశమనం పొందండిలా!

  • WPL 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫుల్ షెడ్యూల్ ఇదే.. మ్యాచ్‌లు ఎప్ప‌ట్నుంచి అంటే?!

  • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

  • Raisins: 30 రోజులు క్రమం తప్పకుండా కిస్‌మిస్‌లు తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా?

  • Peddi: రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌ను నిరాశ‌ప‌రుస్తున్న పెద్ది టీమ్‌.. కార‌ణ‌మిదే?!

Trending News

    • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

    • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd