Coffee: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే కాఫీలో ఈ ఒక్కటి కలిపి తాగాల్సిందే!
ఈజీగా బరువు తగ్గాలి అనుకున్న వారు కాఫీలో ఒక పదార్థాన్ని కలుపుకొని తాగితే తప్పకుండా వెయిట్ లాస్ అవుతారని చెబుతున్నారు.
- By Anshu Published Date - 01:00 PM, Thu - 10 October 24

మనలో చాలామందికి కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కొందరు నిద్ర లేవగానే కాఫీ తాగితే మరికొందరు ఫ్రెష్ అయిన తర్వాత కాఫీ తాగుతూ ఉంటారు. రోజులో కనీసం రెండు మూడుసార్లు అయినా సరే కాఫీ లు, టీలు తాగుతూ ఉంటారు. కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదే కాదే అలా అని ఎక్కువగా తాగితే మాత్రం సమస్యలు తప్పవని చెబుతున్నారు. ఇకపోతే కాఫీ తాగేటప్పుడు అందులో ఒక పదార్థం కలుపుకొని తాగితే ఈజీగా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. రోజూ ఉదయాన్నే కాఫీలో కాస్త నెయ్యి కలుపుకుంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చట. ప్రతిరోజూ ఉదయం కాఫీలో ఒక చెంచా నెయ్యి కలుపుకోవడం వల్ల మీ శరీరానికి చాలా మంచిదట.
నెయ్యి కాఫీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. రిఫ్రెష్ డ్రింక్ కాఫీ ఒక్కటే తాగే బదులు అందులో కాస్త నెయ్యి కలుపుకుంటే మన శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుందట. నెయ్యిలో మంచి కొవ్వులు విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి నిరంతర శక్తిని ఇస్తాయి. అలాగే రోజంతా చురుకుగా అప్రమత్తంగా ఉండటానికి మీకు సహాయపడతాయి. అలాగే లవంగాలలో మన శరీరానికి మేలు చేసే ప్రత్యేకమైన ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. ఇది మన కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణ సమస్యలను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. నెయ్యి కలిపి కాఫీ తాగితే, మనం ఎక్కువగా ఆకలి వేయకుండా, అతిగా తినకుండా ఉండటానికి ఇది చాలా సహాయపడుతుంది.
కాబట్టి, మీరు బరువు తగ్గాలనుకుంటే, ఈ నెయ్యి కాఫీని ప్రయత్నించడం మంచిది. ఈ నెయ్యి కాఫీని ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా అమ్ముతున్నారు. కాబట్టి మీరు బయట కూడా ఈ నెయ్యి కాఫీని తాగవచ్చు. రోజూ ఉదయాన్నే నెయ్యి కాఫీ తాగితే మన మానసిక స్థితి ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుందట. మీ రోజువారీ ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహార పదార్థాలను చేర్చడం చాలా ముఖ్యం. నెయ్యిలోని ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా9 శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయట. ఇది గుండె ఆరోగ్యాన్ని, జీవక్రియను మెరుగుపరుస్తుందట. ఈ నెయ్యి కాఫీ మన రక్తంలో చక్కెర స్థాయిని పెంచదు. ప్రతి రోజూ ఉదయం నెయ్యి కాఫీ తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అదేవిధంగా, నెయ్యి ఒత్తిడి మరియు ఆందోళన నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.