Fruits: ఈ పండ్లను మోతాదులో తింటే చాలు.. బరువు తగ్గడం ఖాయం.. కానీ?
ఇప్పుడు చెప్పబోయే పండ్లను అతిగా తినకుండా కేవలం మోతాదులో తీసుకుంటే ఈజీగా ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 01:00 PM, Fri - 16 May 25

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. అలా అని ఎక్కువగా తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు. కేవలం పండ్లను మోతాదులో మాత్రమే తీసుకోవాలని మోతాదుకు మించి అస్సలు తినకూడదని చెబుతున్నారు. ఇంతకీ ఎలాంటి పండ్లు తీసుకోవాలి అన్న విషయానికి వస్తే.. అరటిపండులో 100కి పైగా కేలరీలు ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల శరీరానికి శక్తిని ఇచ్చినా బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉపయోగపడదట. డైటింగ్ చేస్తున్న వారు రోజూ అరటిపండుని తినడం వల్ల వారి కేలరీ పరిమాణాన్ని నియంత్రించలేకపోవచ్చని చెబుతున్నారు.
అందుకే ఈ పండును కొన్ని రోజుల పాటు తీసుకోకుండా ఉండటం మేలట. అలాగే ద్రాక్ష వల్ల కూడా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ద్రాక్ష శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. దీనిని ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉందట. ఫైబర్ తక్కువగా ఉండటం వలన జీర్ణ ప్రక్రియలో దీర్ఘకాలిక ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. అలాగే వేసవి కాలంలో ఎక్కువగా లభించే పుచ్చకాయ తినడం వల్ల శరీరానికి చల్లదనం కలుగుతుందట. ఇందులో 90 శాతం పైగా నీరు ఉండటంతో పాటు తక్కువ ఫైబర్ ఉంటుంది. ఇది తినడం వలన తాత్కాలికంగా పొట్ట నిండినట్టు అనిపించినా శరీరానికి పెద్దగా పోషణ అందదు అని చెబుతున్నారు. అంతేకాదు ఇది కొన్నిసార్లు నీటి నిల్వను పెంచి బరువు తగ్గడంలో ఆటంకం కలిగిస్తుందట. మామిడిలో ఉండే ఫ్రక్టోజ్ అనే ప్రకృతిసిద్ధమైన చక్కెర శరీరంలో కొవ్వుగా మారి బరువు పెరగడానికి దారితీస్తుందట.
మామిడిని అధికంగా తినడం వలన బరువు తగ్గాలి అన్న లక్ష్యం వ్యతిరేక దిశగా వెళ్లే అవకాశముంటుందట. కొంతమంది తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలనే ఉద్దేశంతో మొదలు పెట్టినా రుచికి లోనై ఎక్కువగా తినడం వల్ల ఆశించిన ఫలితం కనిపించకపోవచ్చని చెబుతున్నారు. అలాగే పైనాపిల్ లో చక్కెర పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల ఇది తినడం ద్వారా తీపి అనుభూతి వస్తుందట. కానీ దీన్ని ఎక్కువగా తినడం శరీరంలో షుగర్ లెవల్స్‌ను పెంచి డైటింగ్ ప్రయోజనాలను తగ్గించగలదనిన్ను ఒకవేళ తినాలంటే పరిమితంగా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ఈ పండ్లను మితంగా తీసుకోవడమో లేక తాత్కాలికంగా నివారించడమో చేస్తే మంచి ఫలితం ఉంటుందట. అయితే కొన్ని పండ్లు డైటింగ్ సమయంలో శరీరానికి తక్కువ కేలరీలతో అధిక ఫైబర్ తో సహాయపడతాయి. బొప్పాయి, ఆపిల్, జామ, నేరేడు, బెర్రీలు వంటి పండ్లు శరీరానికి అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా జీర్ణవ్యవస్థను బాగా పని చేసేలా చేస్తాయి. ఇవి ఆకలిని తగ్గించి ఎక్కువ తినకుండా నియంత్రణలో ఉంచే గుణం కలిగి ఉంటాయట.