HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Foods That You Should Avoid During Winter To Control Uric Acid

Winter Tips: చలికాలంలో కీళ్ల నొప్పులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసా?

చలికాలంలో వచ్చే కీళ్ల నొప్పులు వంటివి తగ్గాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని అప్పుడే యూరిక్ యాసిడ్ స్థాయి తగ్గి కీళ్ల నొప్పులు రావు అని చెబుతున్నారు.

  • Author : Anshu Date : 30-12-2024 - 12:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Winter Tips
Winter Tips

అసలే చలికాలం రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతూనే ఉంది. అయితే చలికాలంలో చాలా రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అటువంటి వాటిలో ఎముకలు కీళ్ల నొప్పుల సమస్య కూడా ఒకటి. యూరిక్ యాసిడ్ కారణంగా ఈ సమస్యలు తీవ్రమవుతూ ఉంటాయి. ఈ రోజుల్లో అధిక యూరిక్ యాసిడ్ ప్రధాన సమస్యగా మారింది. రోజూ తీసుకునే ఫుడ్, డ్రింక్స్‌లో ఉండే ప్యూరిన్స్ అనే రసాయనాల్ని శరీరం విచ్ఛిన్నం చేసినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఈ వ్యాధి ప్రధాన లక్షణాల్లో కీళ్ల నొప్పులు ముందు వరుసలో ఉంటుంది. ​ఆల్కహాల్, ముఖ్యంగా బీర్ అధిక సాంద్రత కలిగి ఉంటాయి. ఇవి తాగితే యూరిక్ యాసిడ్ స్థాయిలు అధికంగా పెరుగుతాయి. ఆల్కహాల్ శరీరం నుంచి యూరిక్ యాసిడ్ తొలగింపును నిరోధిస్తుంది.

అంతేకాకుండా శరీరంలో దాని స్థాయిలను పెంచుతుంది. ఆల్కహాల్ తాగడం వల్ల కాలేయం డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఆల్క‌హాల్ ఎక్కువ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ స్పటికాల రూపంలో కీళ్లలో పేరుకుపోయే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. సోడా, జ్యూస్, స్పోర్ట్స్ డ్రింక్స్ మొదలైన ఫ్రక్టోజ్ డ్రింక్స్ యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ఫ్రక్టోజ్ అనేది అనేక పండ్లలో కనిపించే ఒక రకమైన చక్కెర. కానీ ప్రాసెస్ చేసిన ఆహారాలు, పానీయాలకు దీనిని జోడించినప్పుడు, అది యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది. అందుకే సోడాలు, కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ జ్యూసులు ఎక్కువగా తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా యూరిక్ సమస్య ఉన్నవారు రెడ్ మీట్ ఎక్కువగా తినకూడదట. ముఖ్యంగా ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే గొర్రె, మేక, బీఫ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే చాలా మంది లివర్, బోటి తింటుంటారు.

వీటిని కూడా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ బాగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా ఈ ఎనర్జీ డ్రింక్స్ అధిక మొత్తంలో చక్కెర, కృత్రిమ స్వీటెనర్లను కలిగి ఉంటాయి. వీటిని తాగడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో కీళ్ల నొప్పుల సమస్య, కిడ్నీలో రాళ్ల సమస్యలు పెరుగుతాయి. ఈ డ్రింక్స్‌ తో పాటు ప్యూరిన్ అధికంగా ఉండే కొన్ని ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. తేనె, స్వీట్స్, రెట్ మీట్, పప్పులు వంటివి రాత్రి పూట తినకూడదని చెబుతున్నారు. అలాగే ఆస్పరాగస్ పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, వివిధ రకాల బీన్స్, పుట్టగొడుగులలో ప్యూరిన్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. యూరిక్‌ యాసిడ్‌ సమస్యతో బాధపడేవారు ప్యూరిన్‌ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే ఈ పరిస్థితి మరింత పెరిగే ప్రమాదం ఉంది.

అందుకే వీటిని ఎక్కువగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అయితే యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అన్న విషయానికొస్తే.. యూరిక్ యాసిడ్ తగ్గడం కోసం పుష్కలంగా నీరు తాగాలి. నీరు తాగడం వల్ల మూత్ర పిండాలు శరీరం నుంచి యూరిక్ యాసిడ్‌ ను తొలగిస్తాయి. కాగా యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచడంలో ఊబకాయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నించడం మంచిదని చెబుతున్నారు. శరీరం నుంచి యూరిక్ యాసిడ్ తొలగించడంలో వ్యాయామం సహాయపడుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువై కీళ్ల నొప్పులు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది అని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • foods
  • health tips
  • uric acid
  • Winter Tips

Related News

Coconut Water

ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఏమ‌వుతుంది?

కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం వంటి సహజ ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో నీరు, ఖనిజాల సమతుల్యతను కాపాడతాయి.

  • Onion

    పచ్చి ఉల్లిపాయను ఎవరు తినకూడదు?

  • Healthy Lifestyle Tips

    ఆయుర్వేదం కొత్త జీవితాన్ని ఎలా ఇవ్వగలదు?

  • Motion Sickness

    Vomiting Tips: ప్రయాణ సమయంలో వాంతులు అవుతున్నాయా? మీ కోసం చిట్కాలు

Latest News

  • Tata Intra EV Price in 2026 : టాటా మోటార్స్ నుండి ‘ఇంట్రా EV’ పికప్ విడుదల!

  • Whatsapp: మొబైల్ నంబర్ లేకుండానే చాటింగ్.. వాట్సాప్ లో సరికొత్త ఫీచర్

  • University of Malaysia : మలేషియా వర్సిటీతో చెన్నైస్ అమృత ఒప్పందం!

  • World Diamond Day : దేశవ్యాప్తంగా తొలి ‘వరల్డ్ డైమండ్ డే’ వేడుకలు

  • Tanishka Jewellery : తనిష్క్ కొత్త ప్రచారకర్తగా రుక్మిణి వసంత్

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd