Health Benefits: మీ కంటిచూపు ఎప్పుడు సురక్షితంగా ఉండాలంటే ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే?
మన శరీరంలో ఉండే ముఖ్యమైన అవయవాలలో కళ్ళు కూడా ఒకటి. కళ్ళు లేకపోతే మొత్తం అంతా చీకటి మయం అవుతుంది. అందుకే కంటిని ఎల్లప్పుడూ సురక్షితంగా
- By Nakshatra Published Date - 06:15 PM, Fri - 15 December 23
మన శరీరంలో ఉండే ముఖ్యమైన అవయవాలలో కళ్ళు కూడా ఒకటి. కళ్ళు లేకపోతే మొత్తం అంతా చీకటి మయం అవుతుంది. అందుకే కంటిని ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచుకోవాలని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. అందుకోసం కొన్ని రకాల టిప్స్ ని పాటిస్తే సరి. కంటిచూపు సురక్షితంగా ఉంటుంది. మామూలుగా షుగర్ తో బాధపడుతున్న చాలామందికి షుగర్ లెవెల్స్ పెరగడం తగ్గడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఎప్పుడూ కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండాలి. లేదంటే కంటి చూపు మందగిస్తుంది. కొన్ని కొన్ని సార్లు చూపు కోల్పోవడం కూడా ప్రారంభమవుతుంది. అయితే సహజంగా షుగర్ వ్యాధిగ్రస్తులు ఏడాదికి ఒకసారి పూర్తి శరీర పరీక్ష చేయించుకోవడం మంచిది.
దానివలన కళ్ళకు ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. కళ్ళలో ఎలాంటి ఆకస్మిక లక్షణాలు కనిపించిన వాటి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలి. చేపలు తీసుకుంటే మంచిదని కళ్ళు బాగుంటాయని ఇంట్లో పెద్దవారు వైద్యులు చెబుతూ ఉంటారు. చేపల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు మీ కళ్ళతో సహా వివిధ రకాల శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే విటమిన్ ఏ, విటమిన్ ఇ ,విటమిన్ సి, జింక్ ,ఐరన్ మొదలైన పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలాగే ఇది మీ రక్తంలో షుగర్ లెవెల్స్ ను పెంచకుండా ఉండాలి. అలాగే సహజంగా ధూమపానం చేయడం వల్ల మీకు మరి మీ చుట్టూ ఉన్నవారికి ప్రమాదకరం. ధూమపానం అనేది మీ శరీరంలో చిన్న గొట్టాలతో సహా ఒక నాడి ధమని ప్రతిదీ ప్రభావితం చేస్తుంది.
దాంతో మీ చూపు దెబ్బతింటుంది. అలాగే తీవ్రమైన ప్రభావాలు కలిగిస్తుంది. ఆరోగ్యవంతులు నుండి అన్ని రకాల జబ్బులు ఉన్నవారు వరకు వైద్యులు సూచనతో వ్యాయామం చేయడం చాలా మంచిది. ప్రధానంగా షుగర్ పేషెంట్లు రోజు జాగింగ్, వాకింగ్ లాంటివి చేయడం చాలా ముఖ్యం. దాంతో మీ రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మీ కళ్ళను కూడా ఎప్పుడు సురక్షితంగా ఉంచుకోవచ్చు. అధిక షుగర్ మీ రెటినాలకి డైరెక్ట్‌గా ఎఫెక్ట్ పడుతుంది. ముఖ్యంగా మీ రెటీనాలోని చిన్న ప్రాంతాలకు ఆహారం అందించి చిన్న రక్తనాళాలు దెబ్బతింటాయి. అలాగే కళ్లకు చేరాల్సిన పోషకాలు కూడా అందవు. కంటి వెనక ఉన్న సన్నని కణజాలంలో 65% కాంతి సెన్సింగ్ కణాలు ఉంటాయి. ఇవి మీ కళ్ళు చూసే కాంతిని మెదడుకు సమాచారంగా ప్రచారం చేస్తాయి. కాబట్టి రక్తంలో అధిక షుగర్ లెవెల్స్ ప్రభావితం చేస్తాయి.
Related News
Benefits Of Kundru: దొండకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. దొండకాయలో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణ ప్రక్రియను సజావుగా అమలు చేయడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం మరియు అపానవాయువు వంటి సమస్యలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.