Aloe Vera: కలబంద వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?
కలబంద వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పూర్వం నుంచి ఇప్పటి వరకు కలబందను ఎన్నో ఔషధాలు తయారీలో వినియోగిస్తూనే ఉన్నారు. అయితే చాలామంది కలబంద కేవలం అందం కోసం మాత్రమే అని అనుకుంటూ ఉంటారు. కానీ చాలామందికి
- Author : Anshu
Date : 04-07-2024 - 8:25 IST
Published By : Hashtagu Telugu Desk
కలబంద వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పూర్వం నుంచి ఇప్పటి వరకు కలబందను ఎన్నో ఔషధాలు తయారీలో వినియోగిస్తూనే ఉన్నారు. అయితే చాలామంది కలబంద కేవలం అందం కోసం మాత్రమే అని అనుకుంటూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కలబంద వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. మరి కలబంద వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కలబంద రసాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుందట. అలాగే హెయిర్ ఫాల్ సమస్య నుంచి బయటపడవచ్చు. జుట్టు పెరగడం కూడా మొదలవుతుంది. కలబందలో ఉండే యాంటీ వైరల్ యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రును తొలగించడానికి ఎంతో బాగా పనిచేస్తాయి. అలాగే కలబందలో ఉండే ఎంజైన్ బాబు జుట్టు లోపలి వరకు వెళ్లి పోషణను అందిస్తాయి. కలబందను తరచుగా జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు కూడా సిల్కీగా ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఏవైనా గాయాలు అయినప్పుడు ఆ ప్రదేశంలో కలబంద జెల్ అప్లై చేస్తే గాయాల వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గించుకోవచ్చు.
షుగర్ వ్యాధి ఉన్నవారు కలబంద జ్యూస్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి. అలాగే కలబంద రసం మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుందట. ఇక ఐస్ క్యూబ్స్ ట్రే లో అలోవెరా జెల్ ఉంచి క్యూబ్స్ లో తయారైన తర్వాత వాటిని ముఖంపై మృదువుగా మసాజ్ చేసినట్లు అప్లై చేయడం వల్ల సహజ మెరుపు సంతరించుకుంటుందట. అలాగే అలోవెరా జెల్ ను మీ చర్మం పై మీరుగా అప్లై చేయడం వల్ల చర్మం తేమగా మారుతుంది. చర్మం పై ఉండే మొటిమలు మచ్చలు వంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ప్రతిరోజు ఉదయాన్నే కలబందను తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
note: ఈ సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడింది. పైన చెప్పిన వాటిలో ఎటువంటి సందేహాలు ఉన్నా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.