Foods for Better Sleep: రాత్రిళ్ళు నిద్ర సరిగా పట్టడం లేదా.. అయితే ఈ ఫుడ్స్ తినాల్సిందే!
Food for Better Sleep: రాత్రి సమయంలో మంచి నిద్ర రావాలి అనుకుంటే కచ్చితంగా కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవాలని అప్పుడే కంటి నిండా నిద్ర వస్తుంది అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 08:03 AM, Thu - 9 October 25
Food for Better Sleep: మామూలుగా ప్రతి ఒక్కరూ మంచి నిద్ర కావాలని కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా రాత్రి సమయంలో కంటి నిండా నిద్రపోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా, ఒత్తిడి వంటి సమస్యల కారణంగా కంటి నిండా నిద్ర లేక నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితే రాత్రిళ్ళు కంటి నిండా నిద్ర పోవాలంటే కొన్ని రకాల ఫుడ్స్ కీ దూరంగా ఉండాలి.
అలాగే కంటి ఉండే నిద్రపోవాలి అన్నప్పుడు కొన్ని రకాల ఫుడ్స్ ని తీసుకోవాలని కూడా చెబుతున్నారు నిపుణులు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మనం తీసుకునే ఆహారం మన నిద్రను బాగా ప్రభావితం చేస్తుందట. కాబట్టి మీరు ఏమి తింటున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే నిద్రపోవడానికి మూడు గంటల ముందు తినడం మంచిది. రాత్రిపూట మఖానాను ఒక గ్లాసు పాలతో కలిపి తీసుకోవడం వల్ల మంచి నిద్ర వస్తుందట. ఇందులో నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచే గుణాలు ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళనను తగ్గించి నిద్రను ప్రేరేపించడంలో సహాయపడతాయట.
అలాగే బాదం మీ నిద్ర నాణ్యతను పెంచుతుందట. ఎందుకంటే బాదంలో మెలటోనిన్ హార్మోన్ ఉంటుందని, ఇది మీ నిద్రను నియంత్రిస్తుందని, శరీరాన్ని మంచి నిద్ర కోసం సిద్ధం చేస్తుందని చెబుతున్నారు. అలాగే రాత్రిళ్ళు జాస్మిన్ టీ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందట. ఇది ఆందోళన, డిప్రెషన్, ఒత్తిడి వంటి సమస్యలను తగ్గిస్తుందట. అదేవిధంగా డార్క్ చాక్లెట్ కూడా మెరుగైన నిద్రను అందిస్తుందట. డార్క్ చాక్లెట్ లోని సెరోటోనిన్ మెదడును శాంతపరుస్తుందని, బాగా నిద్రపోవడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.