Health Tips: షుగర్ ఉన్నవారు పరగడుపున టీ, పాలు తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
షుగర్ సమస్యతో బాధపడుతున్న వారు పరగడుపున టీ పాలు తాగవచ్చా లేదా తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 12:35 PM, Sun - 19 January 25

మామూలుగా షుగర్ వ్యాధి గ్రస్తులు ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అన్నా ఎటువంటి పానీయాలు తాగాలి అన్నా కూడా సంకోచిస్తూ ఉంటారు. అటువంటి వాటిలో పాలు టీ కూడా ఒకటి. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత కొంతమందికి పాలు కాఫీ టీలు తాగే అలవాటు ఉంటుంది. ఇంకొందరు బెడ్ కాఫీ రూపంలో కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే షుగర్ సమస్య ఉన్నవారు ఉదయాన్నే పరగడుపున టీ పాలు తాగవచ్చా ఒకవేళ తాగితే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అయితే డయాబెటిస్ ఉన్నవారు పాలు టీ తాగడం మంచిదే కానీ రక్తంలో షుగర్ లెవెల్స్ అధికంగా ఉన్నప్పుడు వీటిని తాగకపోవడమే మంచిది అని చెబుతున్నారు. అలాగే ఖాళీ కడుపుతో మిల్క్ టీ తాగడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయట. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా సమస్యలను కలిగిస్తుందని చెబుతున్నారు. టీలోని కెఫిన్ రక్తంలో చక్కెర అసమతుల్యతను మరింత దిగజారుస్తుంది. ఇది మధుమేహంతో సంబంధం ఉన్న అసౌకర్యం, ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుందట. ఖాళీ కడుపుతో మిల్క్ టీ తాగడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయట.
ఉదయాన్నే ఈ పానీయాలు తాగడం వల్ల అజీర్ణం ఆమ్లత్వం, వాపు రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులు వంటి సమస్యలు వస్తాయట. అయితే ఇవన్నీ సురక్షితంగా ఉండాలి అంటే మిల్క్ టీని మితంగా తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావట. రక్తంలో చక్కెర పెరుగుదలను నివారించడానికి మిల్క్ టీని మితంగా భోజనం తర్వాత తీసుకోవాలట. రక్తంలో చక్కెర నియంత్రణలో రాజీ పడకుండా ఈ పానీయాన్ని ఆస్వాదించడానికి తియ్యని లేదా కొద్దిగా తియ్యని పాల టీని ఎంచుకోవడం గొప్ప మార్గం అని చెబుతున్నారు.